మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని యజమాని దురుసు ప్రవర్తన నచ్చకపోవడంతో ఓ వంట మనిషి తనకు విద్యుత్ షాక్ ఇవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని అంధేరిలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ వంట మనిషి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అసలు విషయం తెలుసుకోవాల్సింది. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే.. బేత్‌షీబా సేథ్ అనే మహిళ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే తన ఇంట్లో వంట చేయడానికి ఆమె రాజు సింగ్ అనే ఒక వ్యక్తిని నియమించుకుంది. అయితే అతడు పని సరిగా చేయటం లేదని ఆమె ఓ సారి అతడిపై దురుసుగా ప్రవర్తించింది. దీంతో రాజు సింగ్ ఆమె అతనిపై అలా ప్రవర్తించడం తట్టుకోలేకపోయాడు. ఆ యజమానిపై కోపం పెంచుకున్నాడు.
అయితే ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం పూట ఆమె నివసించే ఫ్లాట్‌కు వెళ్లాడు రాజ్ సింగ్. తన దగ్గర ఉన్నటువంటి అదనపు తాళం చెవితో ఇంటి తలుపులు తెరిచేశాడు. అయితే ఆ సమయంలో బేత్‌షీబా సేథ్ నిద్ర పోతోంది. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారంగానే.. ఆ వంట మనిషి రాజు సింగ్ విద్యుత్ బోర్డులోని సాకెట్‌లో వైర్లు ఉంచి ఓ సారి ఆమెకు ఒక్కసారిగా కరెంటు షాక్ ఇచ్చాడు. దీంతో ఆమె ఉలిక్కిపడి లేచింది. ఏమైందోనని చుట్టుపక్కల చూసింది. అయితే ఆమె నిద్ర లేవగానే ఇప్పుడు ఎలా ఉందంటూ ఆ నిందితుడు ఆమెను ప్రశ్నించాడు. అంతేకాదు ఆమెపై అలా వరుసగా కొన్నిసార్లు షాక్ ఇచ్చాడు. దీంతో సేథ్ ఆ కరెంట్ షాక్ చిత్రహింసలను భరించలేకపోయింది. ఇక రాజు సింగ్‌తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ జరగుతుండగా.. రాజు సింగ్ ఆమె గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు.
అయితే ఈ బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆ అరుపులు విని పక్క గదిలో నిద్రపోతున్న ఆమె కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అయితే ఆ వంట మనిషి తన కొడుక్కి కూడా ఏదైనా హాని చేస్తాడేమోనని అనుకుని ఆ బాలుణ్ని ఇక్కడి నుంచి పారిపొమ్మని చెప్పింది . అయితే కొద్ది సేపటి తర్వాత ఆ నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పాడు. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ దాడి గురించి సేథ్ తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే వారు ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చేశారు. ఇక చివరికి ఈ ఘటనపై అంబోలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం