Mumbai Serial Blast accused: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల (Mumbai Bomb Blasts) ఘటన ఇప్పటికీ ఉలిక్కిపడేలా చేస్తుంటుంది. భారత్‌పై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. ఈ ఘటన 1993 మార్చి 12న జరిగింది. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మందికిపైగా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ వరుస పేలుళ్ల మోస్ట్ వాంటెడ్ నిందితుడు, దావూద్ గ్యాంగ్ సభ్యుడు, ఛోటా షకీల్‌కు అత్యంత సన్నిహితుడు సలీం ఘాజీ (Salim Ghazi) శనివారం పాకిస్తాన్‌లోని కరాచీలో మరణించాడు. ఈ మేరకు ముంబై పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. నివేదికల ప్రకారం, సలీం ఘాజీ గత కొన్ని రోజులుగా అధిక రక్తపోటు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. 1993లో ముంబైలో దాడి తర్వాత దావూద్ ఇబ్రహీం ఇతర సహచరులతో కలిసి పారిపోయాడు. ఈ ముంబై పేలుళ్లలో ఘాజీ కీలక నేరస్థుడు. ఈ ఘటన అనంతరం తన ఆచూకీ లభించకుండా.. నిరంతరం తన ఉనికి మార్చుకుంటూ వచ్చాడు. దుబాయ్‌లో, ఆపై పాకిస్థాన్‌లో ఛోటా షకీల్ అక్రమ కార్యకలాపాలకు సైతం ఘాజీ సహకరించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
ముంబై పేలుళ్లలో సలీం ఘాజీతో పాటు ఛోటా షకీల్, దావూద్ ఇబ్రహీం, టైగర్ మీనన్, అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే.. ఈ ఉగ్రవాదులంతా కరాచీ లేదా యూఏఈలో ఇప్పటికీ తలదాచుకుంటున్నారని ఇంటిలిజెన్స్ పేర్కొంటోంది. సలీం ఘాజీపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అతనిని పట్టుకోవడానికి ఇంటర్‌పోల్ సైతం ప్రయత్నాలు చేస్తోంది. కానీ చాలాసార్లు అతను తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
The most wanted 1993 serial blast accused Salim Gazi, a member of the Dawood gang and close aide of Chota Shakeel died on Saturday in Karachi, Pakistan: Mumbai Police Sources
— ANI (@ANI) January 16, 2022
Also Read: