Air India Flight: మరోసారి వార్తల్లో ఎయిరిండియా.. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్‌లోంచి పొగలు..!

ఎయిర్ ఇండియా విమానం AI 639 లో క్యాబిన్ లో ఏదో కాలిపోతున్నట్లు వాసన రావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న ప్రయాణీకులను హుటాహుటిన కిందకు దింపేశారు. వారందరినీ మరొక విమానంలో కూర్చోబెట్టారు. విమానం చెన్నైకి బయలుదేరింది. ప్రయాణికులంతా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Air India Flight: మరోసారి వార్తల్లో ఎయిరిండియా.. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్‌లోంచి పొగలు..!
Air India Flight

Updated on: Jun 29, 2025 | 7:22 AM

చెన్నైకి వెళ్లా్ల్సిన ఎయిర్‌ ఇండియా విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. కాక్‌పిట్‌లో మండుతున్న వాసన రావటం గమనించిన పైలెట్‌ అప్రమత్తంగా వ్యవహరించాడు. జూన్‌ 28 శుక్రవారం నాడు ముంబై నుండి చెన్నై వెళ్తున్న విమానం కాక్‌పిట్ నుండి అకస్మాత్తుగా మండుతున్న వాసన రావడం గమనించినట్టుగా ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు. మా గ్రౌండ్ బృందం ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుండి దిగి మరొక విమానం ఎక్కడానికి సహాయం చేసిందని చెప్పారు. ఈ సమయంలో ప్రయాణీకులకు ఎటువంటి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఢిల్లీ నుండి జమ్మూకు వెళ్లాల్సిన మరో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరిగి వచ్చింది. ఢిల్లీ -జమ్మూ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా- 171 విమాన ప్రమాదం తర్వాత ఈ సంఘటనలు జరిగాయి.

ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందిః
గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కేవలం 2 నిమిషాలకే ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయిన ఘటన యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 275 మంది మరణించారు. ఇందులో సిబ్బందితో సహా విమానంలో ఉన్న 241 మంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో కేవలం ఒక యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. డాక్టర్స్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టి విమానం కూలిపోయింది.

ప్రమాదం తర్వాత, దర్యాప్తు కోసం DGCA అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ 3 నెలల తర్వాత తన నివేదికను సమర్పిస్తుంది. అదే సమయంలో భారతదేశం, విదేశాల నుండి 8 ఏజెన్సీలు విమాన ప్రమాదంపై దర్యాప్తులో నిమగ్నమై ఉన్నాయి. ప్రస్తుతం, DGCA అన్ని విమానయాన సంస్థలను గ్రౌండ్ ఆపరేషన్‌కు ముందు అన్ని విమానాలను తనిఖీ చేసిన తర్వాతే విమానాలు నడపడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..