MP Serial Killer Arrest: మధ్యప్రదేశ్‌ను గజగజలాడించిన సీరియల్ కిల్లర్ (19) ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వరుసగా ఐదుగురు సెక్యూరిటీ గార్డులను అతి దారుణంగా తలపై కొట్టి చంపిన ఘటన అటు రాష్ట్రంతోపాటు.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. సాగర్ పట్టణంలోనే నలుగురు సెక్యూరిటీ గార్డులు దారుణహత్యకు గురయ్యారు. మొత్తం ఐదుగురు సెక్యూరిటీ గార్డులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కేజీఎఫ్’ సినిమాలో రాకీభాయ్ లా ఫేమస్ అవ్వాలని నిందితుడు కోరుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేజీఎఫ్ సినిమా నుంచి ప్రేరణ పొందిన శివప్రసాద్.. పేరు కోసం ఇలా హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోది. హత్యకు గురైన వారిలో ఒకరి సెల్ ఫోన్ దొంగలించడంతో మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి నిందితుడిని భోపాల్‌లో అరెస్ట్ చేశారు.
కాగా.. శివప్రసాద్ సెక్యూరిటీ గార్డును చంపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెక్యూరిటీ గార్డును హత్య చేసిన తర్వాత తనను ఎవరూ గుర్తించలేదని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. శివ ప్రసాద్ వరుసగా ఐదు రోజుల్లో ఐదుగురిని దారుణంగా హత్య చేశాడు. రాత్రి సమయంలోనే సెక్యూరిటీ గార్డ్‌లను టార్గెట్ చేశాడు. మే నెలలో మధ్యప్రదేశ్‌లో ఓ ఓవర్ బ్రిడ్జి వద్ద సెక్యూరిటీగా ఉన్న వ్యక్తిని దారుణంగా చంపాడు. చంపి అతని ముఖంపై షూ ఉంచాడు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నాడు నిందితుడు..
ఇలానే.. గురువారం రాత్రి కూడా సోనూ వర్మ(23) అనే వ్యక్తిని మార్బుల్ రాడ్‌తో దారుణంగా కొట్టి చంపాడు. ఆగస్టు28న ఫ్యాక్టరీలో పనిచేసే కళ్యాణ్ లోధిని హత్య చేశాడు. మరుసటి రోజు రాత్రి సాగర్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి శంభు నారాయణ్ దూబేను ఇలానేహతమార్చాడు. దీని తర్వాత ఓ ఇంట్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న మంగళ అహిర్వార్‌ను నిందితుడు చంపేశాడు. భోపాల్ వెళ్లిన తర్వాత కూడా గురువారం ఓ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అయితే.. ఫోన్‌ను ట్రేస్ చేసి సైకో కిల్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. నిందితుడు భోపాల్‌లో మరో సెక్యూరిటీ గార్డును హత్య చేసినట్లు తెలిపారు. సీరియల్ కిల్లర్‌ను ఎంపీ సాగర్ జిల్లా కేక్రా గ్రామానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం