Indian Economy: ఆర్థిక వృద్ధిలో టాప్‌లోకి భారత్.. గుడ్ న్యూస్ చెప్పిన మోర్గాన్‌ స్టాన్లీ..

|

Aug 03, 2023 | 12:47 PM

Morgan Stanley Report - Indian Economy: కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అయితే, రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతోపాటు పలు దేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగుపడలేదు.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు మందగమనం నుంచి వృద్ధిలోకి వస్తున్న తరుణంలో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్‌లలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది.

Indian Economy: ఆర్థిక వృద్ధిలో టాప్‌లోకి భారత్.. గుడ్ న్యూస్ చెప్పిన మోర్గాన్‌ స్టాన్లీ..
Indian Economy
Follow us on

Morgan Stanley Report – Indian Economy: కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అయితే, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతోపాటు పలు దేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగుపడలేదు.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు మందగమనం నుంచి వృద్ధిలోకి వస్తున్న తరుణంలో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్‌లలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది. గతంతో పోల్చుకుంటే భారతదేశం కూడా అధిక వృద్ధివైపు పయనిస్తుందని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. భారత్‌ రేటింగ్‌ను మెరుగుపర్చి ‘ఓవర్‌వెయిట్‌’ గా అంచనావేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, మూలధన వ్యయాలు, లాభాల విషయంలో భారత మార్కెట్ సానుకూల దృక్పథంలో పయనిస్తోందని మోర్గాన్‌ స్టాన్లీ వివరించింది. భారతదేశం స్థూల సూచికలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థ 6.2% GDP అంచనాను సాధించడానికి ట్రాక్‌లో ఉందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోని అన్ని దేశాల మార్కెట్ల పరిస్థితులను అంచనా వేసే అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ .. ఈ సారి అమెరికా ర్యాంకింగ్ AAA నుంచి AA+ లో ఉన్నట్లు తెలిపింది. గతంలో కంటే చైనా వృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు చైనా రేటింగ్‌ను ఈక్వల్‌ వెయిట్‌కు కుదించినట్లు తెలిపింది. ‘‘సంస్కరణలు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారత్‌ కట్టుబడి ఉంది. దీంతో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు, పోర్ట్‌ఫోలియోలు పెరిగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి.. దీర్ఘకాల అభివృద్ధి దిశగా భారత్‌ అడుగులు వేయడం ప్రారంభించింది’’ అని మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో వెల్లడించింది. గతంతో పోలిస్తే మెరుగైన స్థానంలోకి వచ్చిందని పేర్కొంది.

కాగా.. చైనాలో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటం, అమెరికా రుణ రేటింగ్‌ తగ్గిన సమయంలో మోర్గాన్‌ స్టాన్లీ భారతదేశ రేటింగ్‌ ను పెంచడం ప్రపంచ మార్కెట్ లో ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ప్రపంచ మార్కెట్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండనుందని.. ఎన్డీఏ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..