సెప్టెంబరు 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు , అంతా విభిన్నంగా !

| Edited By: Pardhasaradhi Peri

Aug 25, 2020 | 7:52 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్నాయి. కరోనా వైరస్ కారణంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. లోక్ సభ, రాజ్య సభల్లో..

సెప్టెంబరు 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు , అంతా విభిన్నంగా !
Follow us on

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్నాయి. కరోనా వైరస్ కారణంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. లోక్ సభ, రాజ్య సభల్లో సీటింగ్ ఏర్పాట్లు భిన్నంగా ఉండడమే గాక, సభ్యులు భౌతిక దూరం పాటించడానికి అనువుగా ఈ రెండు చాంబర్లు, గ్యాలరీల్లో  వారిని ఎకామడేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఇచ్చిన సమాచారం మేరకు సెషన్ జరుగుతుండగా రెండు చాంబర్లు, గ్యాలరీల్లో సభ్యులు కూర్చోవలసి వస్తుంది. ఓ ఛాంబర్ లో 60 మంది, గ్యాలరీలో 51 మంది, లోక్ సభ ఛాంబర్ లో మిగతా 152 మంది కూర్చుంటారని, లోక్ సభ సెక్రటేరియట్ కూడా దాదాపు ఇలాంటి చర్యలే తీసుకుంటుందని తెలుస్తోంది. ఎలాంటి విరామం లేకుండా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి.

మొత్తం 18 సిటింగ్స్ ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాలపై గల కేబినెట్ కమిటీ తెలిపింది. ఇక భారీ స్క్రీన్లు, తదితర వినూత్న ఏర్పాట్లు చేయనున్నారు.