Monkeypox: మరో రాష్ర్టంలో మంకీపాక్స్ కలకలం..! తెలంగాణలో వైద్యశాఖ అలెర్ట్‌..

భారత్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి--- కేరళ నుండి 3, ఢిల్లీ నుండి 1 కేసు నమోదయ్యాయి. విదేశీ ప్రయాణ చరిత్ర లేని వ్యక్తికి..

Monkeypox: మరో రాష్ర్టంలో మంకీపాక్స్ కలకలం..! తెలంగాణలో వైద్యశాఖ అలెర్ట్‌..
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 26, 2022 | 3:02 PM

Monkeypox: ప్రస్తుతం ప్రపంచ దేశాలను మంకీపాక్స్‌ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే 68 దేశాలలో 16,593 మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. భారత్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి— కేరళ నుండి 3, ఢిల్లీ నుండి 1 కేసు నమోదయ్యాయి. విదేశీ ప్రయాణ చరిత్ర లేని దేశ రాజధానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడిని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంకీపాక్స్ వైరస్‌కు మందు లేదని.. చర్మంపై పూయడానికి లోషన్లు, మల్టీ విటమిన్లు ఇస్తున్నామని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఢిల్లీలో మంకీపాక్స్‌ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. విమానాశ్రయం, పోర్ట్ హెల్త్ ఆఫీసర్లు ప్రాంతీయ కార్యాలయాలకు చెందిన లోకల్‌ డైరెక్టర్లకు పలు సూచనలు చేసింది. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఓ మహిళకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో కలకలం రేపింది.

UP లోని ఔరయ్యాలో మంకీపాక్స్ అనుమానిత కేసు బయటపడింది. ఆ మహిళ ఓ ప్రైవేట్ వైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది. మరింత మెరుగైన వైద్యం కోసం ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. అనుమానిత రోగి నమూనాలను అదనపు విశ్లేషణ కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి పంపించారు. తన చేతులు, అరికాళ్లు విపరీతమైన అసౌకర్యానికి గురవుతున్నాయని బాధిత మహిళ పేర్కొంది. ఈ నేపథ్యంలొ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కూడా అప్రమత్తమైంది. మంకీపాక్స్ అల‌ర్ట్ జారీ చేశారు. ఆ మహిళను బిదునాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆస్ప‌త్రుల్లో.. మంకీపాక్స్ రోగుల కోసం స్పెషల్‌ బెడ్స్‌ ఏర్పాటు చేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మంకీపాక్స్ అనేది వైరస్‌తో సంక్రమించే అరుదైన వ్యాధిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మంకీపాక్స్ వైరస్ పోక్స్విరిడే కుటుంబానికి చెందిన ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినదిగా స్పష్టం చేసింది. ఆర్థోపాక్స్ వైరస్ జాతిలో వేరియోలా వైరస్, వ్యాక్సినియా వైరస్ మరియు కౌపాక్స్ వైరస్ కూడా ఉన్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రివెన్షన్ ప్రకారం.. మనుషులలో మంకీపాక్స్ లక్షణాలు దాదాపుగా చికెన్‌పాక్స్ మాదిరిగానే ఉంటాయి. అయితే అదనంగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు అలసటగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

ఒక వ్యక్తికి మంకీపాక్స్‌ వైరస్ సోకితే 7 నుంచి 14 రోజుల తర్వాత లక్షణాలు ప్రారంభమవుతాయని వైద్యశాఖ వెల్లడించింది.. జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట మరియు వాపు మంకీపాక్స్‌ సాధారణ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. చికెన్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై బొబ్బలు వస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లక్షణాలు ఒక్కోసారి 7 నుంచి 21 రోజుల్లో కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే మైల్డ్ కేసుల్లో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇక మంకీపాక్స్ వైరస్ సోకిన వారు చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. చాలా తక్కువ మందికి ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఇదిలా ఉంటే,

దేశంలో విజృంభిస్తోన్న మంకీపాక్స్‌తో ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ వైరస్‌ వ్యాధిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోందని, రోగులకు చికిత్స అందించేందుకు నోడల్ సౌకర్యంగా హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రిని నియమించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్ రావు తెలిపారు. విదేశాల నుండి, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల నుండి వచ్చే వారిని పరీక్షించడానికి విమానాశ్రయాలలో పరీక్షా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి