PM Modi: భారత జ్ఞానాన్ని సరిహద్దులు దాటి ప్రపంచానికి చేరుస్తున్న మోదీ

భారత జ్ఞానాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుండుతున్నారు. 2019లో SCO దేశాల భాషల్లోకి భారత సాహిత్యాన్ని అనువదించాలన్న ప్రతిపాదన నుంచి… రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రష్యన్ భాషలో భగవద్గీతను బహుమతిగా అందించడం వరకు.. మోదీ చర్యలు భారత సాహిత్యం, ఆధ్యాత్మికతను అంతర్జాతీయ సంభాషణలో భాగం చేస్తున్నాయి.

PM Modi: భారత జ్ఞానాన్ని సరిహద్దులు దాటి ప్రపంచానికి చేరుస్తున్న మోదీ
PM Modi gifts Russian edition of Bhagavad Gita to Putin

Updated on: Dec 05, 2025 | 7:10 PM

భారత సాహిత్యం, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడంలో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ముందుంటున్నారు. 2019లో భారత సాహిత్యాన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దేశాల భాషల్లోకి అనువదించాలనే ప్రతిపాదన నుండి… భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రష్యన్ భాషలో భగవద్గీతను బహుమతిగా అందించడం వరకు.. మోదీ చేసిన ప్రతి అడుగు భారత జ్ఞానాన్ని ప్రపంచ సంభాషణలో భాగం చేయడమే లక్ష్యంగా కొనసాగుతోంది. 2019లో కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన SCO సదస్సులో, మోదీ పది ఆధునిక భారతీయ సాహిత్య రచనలను SCO దేశాల భాషల్లోకి అనువదించాలని ప్రతిపాదించారు. భారత రాయబార కార్యాలయాలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిపుణులతో కలిసి పనిచేశాయి. ముఖ్యంగా రష్యన్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో అనువాదాలకు ప్రాధాన్యత ఇచ్చి, భాషా నిపుణులు, ఎడిటర్లు కలిసి ఆ పుస్తకాలను అక్కడి పాఠకులకు చేరేలా చేశాయి.

భారతదేశం SCO ఛైర్మన్‌గా ఉన్న కోవిడ్ కాలంలో ఇవన్నీ అధికారికంగా విడుదలయ్యాయి. మోదీ అప్పట్లో ఇచ్చిన హామీని సఫలీకృతం చేస్తూ… భారత ఆధునిక రచనల్ని అంతర్జాతీయ పాఠకులకు అందించే దిశగా ఒక పెద్ద అడుగైంది. ఇటీవల పుతిన్ భారత పర్యటన సందర్భంగా, మోదీ రష్యన్ అనువాదంలో భగవద్గీతను బహుమతిగా అందించడం కూడా అదే ప్రయాణంలో మరొక ప్రతీకాత్మక ఘట్టం. శాశ్వత ఆధ్యాత్మిక బోధనలైన గీత, ఆధునిక భారతీయ సాహిత్యం.. ఈ రెండు రకాలూ మోదీ నేతృత్వంలో ప్రపంచ సాంస్కృతిక సంభాషణల్లో చోటు సంపాదిస్తున్నాయి. సరిహద్దులు దాటి భారత్ కథలు, ఆలోచనలు, జ్ఞానం చేరాలని… పదాల శక్తితో దేశాలు దగ్గరవాలని… ఇదే మోదీ తీసుకుంటున్న సాంస్కృతిక, దౌత్యపరమైన సందేశం.