మంత్రివర్గం విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఊహాగానాలు ఊపందకున్నాయి. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో దాదాపు ఏడాది గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది మోదీ సర్కార్. ఢిల్లీ నుంచి అందుతున్న సమచారం ప్రకారం.. మకర సక్రాంతి (జనవరి 14), బడ్జెట్ సెషన్ ప్రారంభం మధ్య ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించవచ్చు. మోడీ కేబినెట్‌లో ఈసారి కొత్త ముఖాలకు కూడా చోటు దక్కవచ్చని భావిస్తున్నారు.
ఈ నెల 29న మొదలు కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. నిజానికి ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా (జేపీ నడ్డా) పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. దీంతో పాటు జనవరిలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. అయితే ఈ సారి తెలుగు రాష్ట్రాలవారికి పెద్ద పీఠ వేసే అవకాశం ఉందంటున్నారు కమలం నేతలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పొడిగింపు ఉంటుందని తెలిపింది. కొంతమంది మంత్రులను కూడా వారి పనితీరు ఆధారంగా తొలగించవచ్చని భావిస్తున్నారు. మోదీ 2.0 క్యాబినెట్‌లో చివరి పునర్వ్యవస్థీకరణ జూలై 7, 2021న జరిగింది. ఇందులో కొంతమంది ప్రముఖుల పేర్లతో సహా 12 మంది మంత్రులు తొలగించబడ్డారు.
అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పడింది. 2021 జులై ఏడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు అంటే.. మోదీ కేబినెట్‌లో మొత్తం 78 మంది ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అంటే మరో ఐదుగురి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం
2023 అన్ని రాజకీయ పార్టీలకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే రాబోయే సంవత్సరంలో 9 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉంది. వచ్చే ఏడాది అంటే 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికలు మరింత కీలక మారనుంది. ఈ ఏడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది . ఇప్పుడు త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ కన్నేసింది.
తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. ఇదే తరహాలో ముందుకు సాగితే వచ్చే ఏడాది తప్పకుండా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. ఇక్కడి నేతలకు మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడి ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు చూస్తోంది. అయితే తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒకరు జి.కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మరో ముగ్గురిలో ముందుగా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్, లక్ష్మణ్, సోయం బాపురావు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే ఉండడం, ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నందున ఈసారి ఏపీలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీకి చెందిన సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే ఇందులో తెలంగాణకే మొదటి అవకాశం ఉంటుందని ఈ ప్రాంత నేతలు అనుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం