పాక్‌కు సరైన మొగుడ్ని దింపుతున్న భారత్‌! ఎవరీ కృష్ణన్‌..? గగన్‌యాన్‌ మిషన్‌ కోసం వెళ్లినోడు.. మళ్లీ IAFలోకి..

పాకిస్థాన్ తో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత వైమానిక దళం గగన్యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ ను తిరిగి పిలిచింది. వారి అనుభవం, నైపుణ్యాలు ప్రస్తుత పరిస్థితిలో చాలా అవసరమని భావించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాక్‌కు సరైన మొగుడ్ని దింపుతున్న భారత్‌! ఎవరీ కృష్ణన్‌..? గగన్‌యాన్‌ మిషన్‌ కోసం వెళ్లినోడు.. మళ్లీ IAFలోకి..
Captain Ajit Krishnan With

Updated on: May 08, 2025 | 5:15 PM

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడి చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి.. పాక్‌ సామాన్య పౌరులకు, పాక్‌ సైన్యానికి ఎలాంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్‌ చేసుకుంది. అయినా కూడా పాకిస్థాన్‌ ప్రతీకారం అంటూ పిచ్చ పనులకు పాల్పడుతోంది. ఇండియాపై క్షిపణి దాడులకు దిగుతోంది. ఇప్పటికే మన ఎస్‌-400 డిఫెన్స్‌ సిస్టమ్‌తో వాటిని అడ్డుకున్నాం. అయితే పాకిస్థాన్‌ నుంచి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉండటంతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఎయిర్‌ ఫోర్స్‌ను మరింత స్ట్రాంగ్‌గా మార్చేందుకు గ్రూప్‌ కెప్టెన్‌ అజిత్‌ కృష్ణన్‌ను మళ్లీ డ్యూటీకి పిలిచింది.

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పనిచేస్తున్న కృష్ణన్‌ను 2027లో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయాణం.. మిషన్ గగన్‌యాన్ కోసం ఎయిర్‌ ఫోర్స్‌ నియమించింది. ఆయనతో పాటు ముగ్గురు, మొత్తం నలుగురు ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది వ్యోమగాములుగా మారేందుకు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం పాకిస్థాన్‌ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే కృష్ణన్‌ అవసరం ఎంతైనా ఉందని భావించిన ఎయిర్‌ ఫోర్స్‌.. వెంటనే ఆయనను వచ్చి ఎయిర్‌ ఫోర్స్‌లో తన పాత పోస్టులో జాయిన్‌ అవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ విషయాన్ని కృష్ణన్‌ కూడా ధృవీకరించారు. ఎయిర్‌ ఫోర్స్‌ నుంచి తనకు పిలుపు వచ్చిందని వెల్లడించారు.

అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు కోసం కృష్ణన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. “ఐఏఎఫ్ నన్ను తిరిగి పిలిచింది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా,” అని కృష్ణన్ వెల్లడించారు. దీంతో ఆయన వీలైనంత త్వరగా ఎయిర్‌ ఫోర్స్‌లో చేరనున్నారు. గ్రూప్ కెప్టెన్ కృష్ణన్ 2003లో ఎయిర్‌ ఫోర్స్‌లో చేరారు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, టెస్ట్ పైలట్ గా సుమారు 2,900 గంటల ఫ్లయింగ్ అనుభవం కలిగి ఉన్నారు. ఆయనకు Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, డోర్నియర్, An-32 వంటి ఆధునాతన ఫైటర్‌ జెట్లు నడిన అనుభవం ఉంది. ఆ అనుభవం ఇప్పుడు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అవకాశం కావడంతో ఆయనను మళ్లీ తిరిగి రప్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..