Techie prashanth: అమ్మ మాట వినకుండా వెళ్లి పాకిస్తాన్‌లో చిక్కుకున్నా.. హైదరాబాద్ చేరుకున్న టెకీ ప్రశాంత్..

|

Jun 01, 2021 | 5:11 PM

Techie prashanth: పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు యువకుడు ప్రశాంత్‌ విడుదలైన సంగతి తెలిసిందే. 2017 నుంచి పాకిస్తాన్ జైలులో ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రశాంత్‌ను పాకిస్తాన్ అధికారులు వాఘా సరిహద్దుల్లో భారత అధికారులకు అప్పగింంచారు. అనంతరం ప్రశాంత్

Techie prashanth: అమ్మ మాట వినకుండా వెళ్లి పాకిస్తాన్‌లో చిక్కుకున్నా.. హైదరాబాద్ చేరుకున్న టెకీ ప్రశాంత్..
Vaindam Prashanth
Follow us on

Techie prashanth: పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు యువకుడు ప్రశాంత్‌ విడుదలైన సంగతి తెలిసిందే. 2017 నుంచి పాకిస్తాన్ జైలులో ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రశాంత్‌ను పాకిస్తాన్ అధికారులు వాఘా సరిహద్దుల్లో భారత అధికారులకు అప్పగింంచారు. అనంతరం ప్రశాంత్ మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్.. ప్రశాంత్‌ను కుటుంబసభ్యులకు అప్పగించారు. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రశాంత్ మాట్లాడారు. తన అమ్మ మాట వినకుండా ప్రేమ విషయంలో ఎక్కువ ఆలోచించకుండా తాను స్విట్జర్లాండ్ వెళ్తూ పాకిస్తాన్లో చిక్కుకున్నానని ప్రశాంత్ వెల్లడించారు. తాను ఇంత త్వరగా విడుదలవుతానని అనుకోలేదని తెలిపారు. తన విడుదల కోసం కృషిచేసిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వానికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని ప్రశాంత్ చెప్పారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు సాఫ్ట్‌వేర్ ప్రశాంత్. తనతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా మగ్గుతున్నారని వెల్లడించారు.

ప్రశాంత్ పాకిస్తాన్‌లో చిక్కుకోక ముందు హైదరాబాద్‌లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రశాంత్ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యలు ఆనందం వ్యక్తంచేశారు. కాగా.. తన కొడుకు సమాచారం అందుకున్న ప్రశాంత్ తండ్రి బాబురావు 2019లో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి విడుదల కోసం ప్రయత్నించాలని కోరారు. ఆతర్వాత ప్రశాంత్ విడుదల కోసం భారత అధికారులు పాకిస్తాన్ అధికారులను సంప్రదించారు.

Also Read:

Amazon Youth Offer: 50% డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్… రూ.499కే ఏడాది ఆఫర్.. వివరాలు..

Cipla on Moderna vaccine: మోడెర్నా బూస్టర్ వ్యాక్సిన్ కోసం సిప్లా గొంతెమ్మ కోరికలు.. కేంద్రం ఓకే చెప్పేనా..?