మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మహిళా వార్డు మరుగుదొడ్డిలో ఓ మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన శిశువును నీళ్ళ బకెట్‌లో ఉంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఆమెను పట్టుకోవడంతో విషయం బయటపడింది.
జనవరి 19వ తేదీ గురువారం రాత్రి 8 గంటల సమయంలో కడుపునొప్పి రావడంతో మైనర్ బాలికను జిల్లా ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మహిళా వార్డులోని మరుగుదొడ్డిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, ఆమె తన కుటుంబంతో ఆసుపత్రి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఒక నర్సు బాత్రూమ్ నుండి పిల్లవాడు ఏడుస్తున్న శబ్దం విన్నది.
దీంతో వెంటనే బాత్‌రూమ్‌కి వెళ్లిన ఆమె ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయింది. చుట్టూ రక్తం చెల్లాచెదురుగా ఉండటాన్ని గుర్తించారు. నవజాత శిశువును బకెట్‌లో ఉంచారు. దీంతో సదరు నర్సు ఇతర సిబ్బందిని పిలిచి, బకెట్‌లో పడి ఉన్న చిన్నారికి చికిత్స అందించారు. ఇంతలోనే అక్కడి నుంచి జారుకుంటున్న మైనర్ బాలికను ఆసుపత్రి సిబ్బంది పట్టుకున్నారు. చివరికి నవజాత శిశువును ఆమె వద్దకు చేర్చినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్‌కు శిశువును అప్పగించిన ఆసుపత్రి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…