Covid Vaccine 24/7: ఆర్థిక పురోగతిని పరుగెత్తించాలంటే 24 గంటలు టీకాలు వేయాలి.. ఆర్థిక శాఖ కొత్త ప్రతిపాదన

|

Jun 10, 2021 | 3:58 PM

Covid Vaccine: దేశ ఆర్థిక పురోగతిని వేగవంతం చేసేందుకు కోవిడ్ వ్యతిరేకంగా రోజులో 24 గంటలు టీకాలు వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేసి సెప్టెంబర్..

Covid Vaccine 24/7: ఆర్థిక పురోగతిని పరుగెత్తించాలంటే 24 గంటలు టీకాలు వేయాలి.. ఆర్థిక శాఖ కొత్త ప్రతిపాదన
Covid Vaccine
Follow us on

దేశ ఆర్థిక పురోగతిని వేగవంతం చేసేందుకు కోవిడ్ వ్యతిరేకంగా రోజులో 24 గంటలు టీకాలు వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేసి సెప్టెంబర్ చివరకల్లా దేశంలో 70 కోట్ల మందికి టీకాలు వేయాలని పేర్కొంది. దేశ ఆర్థిక స్థితిగతులపై గురువారం విడుదల చేసిన నెలవారీ నివేదికలో ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది. ఆర్థిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే ప్రతిపాధన తీసుకొచ్చింది.

సెప్టెంబర్ కల్లా 70 కోట్ల మందికి టీకాలు అందాలంటే.. 113 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది. రోజుకు 93 లక్షల మందికి టీకాలు వేస్తే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని కూడా సూచించింది. ప్రస్తుతం ఉన్న షిఫ్టులను రెండితలు చేయడం, వీలైతే వచ్చే రెండు నెలల రోజుల పాటు రోజులో 24 గంటలూ టీకాలు వేయడం ద్వారా రోజు కోటి టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొంది.

రోజులో 8-9 గంటల వ్యాక్సినేషన్ చేయడం ద్వారా 42.65 లక్షలకు చేరిందని నివేదిక పేర్కొంది. కాబట్టి, షిఫ్ట్‌లను రెట్టింపు చేయడంతోపాటు 24×7  ఇలా కొన్ని నెలలు టీకాలు వేయాలని సూచించింది.  ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లలో సరఫరా గణనీయంగా పెరుగుతుందని భావిస్తోంది.  

ఆగస్టు, డిసెంబర్ మధ్య 216 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్ వేయాలంటే విదేశీ తయారీదారుల నుండి వ్యాక్సిన్లకు ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. 

ఇవి కూడా చదవండి : Vaccination: వేగంగా దేశంలో వ్యాక్సినేషన్..ప్రపంచంలోనే ఎక్కువ వ్యాక్సిన్ లు వేసిన దేశాల్లో రెండో స్థానంలో భారత్!

Indian Railway New Rule: రైలులో ప్రయాణించాలంటే ఆ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసే ఆలోచనల్లో భారత రైల్వే..!