Asaduddin Owaisi: షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు.. అసదుద్దీన్‌ ఒవైసీ కీలక వ్యాఖ్యలు!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా అతని వ్యాఖ్యలపై మజ్లీస్‌ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా రియాక్ట్‌ అయ్యారు. ఇంతకు అతనెవరూ.. అదంతా ఒక డ్రామా.. ఆలాంటి జోకర్ల పేర్లు నా ఎదుట ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Asaduddin Owaisi: షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు.. అసదుద్దీన్‌ ఒవైసీ కీలక వ్యాఖ్యలు!
Asaduddin Owaisi

Updated on: Apr 29, 2025 | 10:03 AM

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. పచ్చని ప్రకృతిని ఆస్వాధించేందుకు వచ్చిన అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో ఉగ్రదాడి విషయంలో భారత్‌ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాశ్మీర్‌లో టపాసులు పేలినా భారత్‌ కాశ్మీర్‌పై నిందలు వేస్తోందని.. భారత్‌ పాకిస్థాన్‌పై నిందలు వేయడం మానేసి..ఉగ్రదాడికి సంబంధించి సాక్ష్యాలను చూపాలని విమర్శించారు. భారత్‌ తనను తానే నిందించుకోవాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై
తాజాగా మజ్లీస్‌ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా రియాక్ట్‌ అయ్యారు.

సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. షాహిద్‌ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అతని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు అతనెవరు ? ఇదంతా ఒక డ్రామా అని అసదుద్దీన్‌ మండిపడ్డారు. నా ముందుకు అలాంటి జోకర్ల పేర్లను తీసుకురావొద్దని వ్యాఖ్యానించారు. ఎందుకు పనికిరాని వాళ్ల గురించి మాట్లాడడం వేస్ట్ అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘గ్రే లిస్ట్’లో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

పాక్‌ మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రిది ఏమన్నారో చూడండి…

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..