Nadella – Modi Meet: మా సహాయం భారత్‌కు ఎప్పుడూ ఉంటుంది.. ప్రధాని మోడీతో సత్య నాదెళ్ల భేటీ..

|

Jan 05, 2023 | 11:28 AM

PM Modi - Satya Nadella Meet: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌, సీఈఓ సత్య నాదెళ్ల గురువారం ఉదయం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, సత్య నాదెళ్ల..

Nadella - Modi Meet: మా సహాయం భారత్‌కు ఎప్పుడూ ఉంటుంది.. ప్రధాని మోడీతో సత్య నాదెళ్ల భేటీ..
PM Modi - Satya Nadella Meet
Follow us on

PM Modi – Satya Nadella Meet: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌, సీఈఓ సత్య నాదెళ్ల గురువారం ఉదయం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, సత్య నాదెళ్ల డిజిటల్ ఇండియా, సాంకేతికతతో కూడిన సమగ్రాభివ‌ృద్ధి గురించి చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. చాలా మంచి సమావేశం జరిగిందని పేర్కొన్నారు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై మోడీ ప్రభుత్వ లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. డిజిటల్ ఇండియా విజన్‌ని గ్రహించి ప్రపంచానికి వెలుగుగా భారతదేశానికి సహాయం చేయడానికి తాము ఎదురు చూస్తున్నామమని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రధాని మోడీ, సత్యనాదెళ్ల పలు అంశాలపై కీలక చర్చించారు. సాంకేతికత, ఆర్థిక వృద్ధి, సాధికారత తదితర విషయాల గురించి చర్చించారు. భారతదేశానికి అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని తెలిపారు. డిజిటల్‌ అభివృద్ధి విషయంలో భారత్‌కు అన్ని విధాలా సహకరించేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని వివరించారు.

ఇవి కూడా చదవండి

సత్యనాదెళ్ల చేసిన ట్వీట్..

అన్ని రంగాల్లో సాంకేతికత ప్రభావాన్ని తెలియజేసేందుకు ‘టెక్‌ ఫర్‌ గుడ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌’ పేరుతో బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల పాల్గొని ప్రసంగించారు. టెక్ పరిశ్రమ ఎంత ముందుకు వచ్చిందో పరిశీలిస్తే ఇది తమకు ‘షోటైమ్’ అని భావిస్తున్నట్లు వివరించారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ ప్రపంచం – ప్రత్యేకించి టెక్ రంగం మళ్లీ వృద్ధిని చూడాలంటే మరో రెండేళ్ల పోరాటానికి సిద్ధమవ్వాలని సూచించారు. టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత తిరోగమనం ఏమిటంటే COVID-19 మహమ్మారి ద్వారా పెరిగిన డిమాండ్ తగ్గడం ప్రారంభించిందన్నారు. ఇది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మాంద్యంతో కలిసి సాధారణీకరణకు దారితీసిందన్నారు.

టెక్‌ పరిశ్రమ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడిన నాదెళ్ల.. రెండేళ్లలో పెను మార్పులు వస్తాయని తెలిపారు. భారత్‌ లోని కంపెనీలు సైతం క్లౌడ్‌ సాంకేతికతను అధికంగా వినియోగించుకుంటున్నాయని.. టెక్నాలజీ రంగంలో పెను మార్పును క్లౌడ్‌ తీసుకొస్తుందన్నారు. క్లౌడ్‌ వల్ల 70-80 శాతం మేర ఇంధన భారం తగ్గుతుందన్నారు. క్లౌడ్ చివరి నమూనా కృత్రిమ మేధస్సు (AI) అవుతుందని భావిస్తున్నానన్నారు. అది రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాలలో జరగబోతోందని.. టెక్ పరిశ్రమ వృద్ధి మరింత పెరుగుతుందని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..