
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇండియా టూర్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ 13న కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఈవెంట్ గందరగోళానికి దారి తీయడంతో పశ్చిమబెంగాల్ సర్కార్ సిట్ ఎంక్వరీకి ఆదేశించింది. ఈవెంట్ మేనేజర్ శతద్రు దత్తాను అరెస్టు చేసి.. విచారించడంతో మెస్సీ టూర్ ఆర్ధిక లావాదేవీలతోపాటు.. ఇండియా టూర్‌లో ఆయన ఎలా ఫీలయ్యారనే అంశాలు బయటపడ్డాయి. ప్రధానంగా.. మెస్సీని తాకడం, హగ్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ స్పోర్ట్స్ మంత్రి ఆరూప్ బిస్వాస్.. మెస్సీని వెంటాడుతూ.. అతని కుటుంబ సభ్యులను ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన ఫీల్ అయినట్లు చెప్పారు. మెస్సీ ఇండియా టూర్ కాస్ట్ వివరాలపైనా సిట్ అధికారులు.. దత్తాను ఆరా తీశారు. దీంతో.. మెస్సీకి మొత్తం 89 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. 100 కోట్లు రాగా.. 11కోట్లు కేంద్రానికి ట్యాక్స్ చెల్లించినట్లు చెప్పారు. ఈ వంద కోట్లలో 30 శాతం స్పాన్సర్స్ నుంచి.. మరో 30 శాతం టికెట్ సేల్స్ ద్వారా సేకరించినట్లు వివరించారు. అయితే.. దత్తా అకౌంట్లో మరో 20 కోట్ల రూపాయలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం కూడా మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్ ఈవెంట్స్ ద్వారానే వచ్చినట్లు తేల్చారు. ఈ 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసిన సిట్ అధికారులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తుండడం ఆసక్తిగా మారుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..