దేశంలో ఈ రాష్ట్ర రైతులు అత్యంత ధనవంతులు..! అయితే మీ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది..?

|

Sep 17, 2021 | 8:12 PM

Richest Farmers: హరిత విప్లవం తర్వాత పంజాబ్ రైతుల కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను

దేశంలో ఈ రాష్ట్ర రైతులు అత్యంత ధనవంతులు..! అయితే మీ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది..?
Meghalaya Farmers
Follow us on

Richest Farmers: హరిత విప్లవం తర్వాత పంజాబ్ రైతుల కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు. అంతేకాదు పంజాబ్‌ రైతులు అత్యంత ధనవంతులు కూడా. అయితే తాజా గణాంకాలు మరో విషయం చెబుతున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) నుంచి ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం పంజాబ్ రైతులు ఇకపై దేశంలో ధనవంతులు కాదు. వారి స్థానాన్ని మరో రాష్ట్రం ఆక్రమించింది. గణాంకాల ప్రకారం.. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ రైతులు ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనవంతులు.

మేఘాలయలో సగటు రైతు కుటుంబం 2018-19లో నెలకు రూ .29,348 సంపాదించగా.. పంజాబ్‌లోని ఒక రైతు కుటుంబం దాదాపు రూ.26,701 సంపాదించింది. దీంతో పంజాబ్‌ రెండో స్థానానికి పడిపోయింది. మూడు, నాలుగు స్థానాల్లో హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. హర్యానా నుంచి ఒక రైతు ఆదాయం సంవత్సరానికి రూ.22,841 కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక రైతు కుటుంబం సగటున సంవత్సరానికి రూ.19,225 సంపాదిస్తుంది. అదే సమయంలో ఐదో స్థానంలో జమ్మూ కశ్మీర్‌ నిలవడం విశేషం. కశ్మీర్ రైతులు సంవత్సరానికి రూ.18,918 సంపాదిస్తున్నారు.

మేము అత్యల్ప ఆదాయ రాష్ట్ర రైతుల గురించి మాట్లాడితే అందులో జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి. జార్ఖండ్ రైతుల వార్షిక ఆదాయం రూ.4895. ఒడిశా (రూ. 5112), పశ్చిమ బెంగాల్ (రూ. 6762), బీహార్ (రూ. 7542), ఉత్తరప్రదేశ్ (రూ. 8061). దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల రైతుల ఆదాయం ఎక్కువగా ఉంది. ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉండటం దీని వెనుక కారణం. దేశంలో రైతుల సంఖ్యపై అధికారిక అంచనా లేదు. దీని కారణంగా వారు సంపాదించిన ఆదాయ స్థాయికి సంబంధించిన వార్షిక అంచనా అందుబాటులో లేదు. ఈ లెక్కల అంచనాలు రైతు సర్వే నుంచి పొందిన డేటా ఆధారంగా ఉంటాయి.

Sidhu – Rakhi Sawant: సిద్దూ‌ను రాఖీ సావంత్‌తో పోల్చిన ఆప్ లీడర్.. పంజాబ్‌లో రాజకీయ రచ్చ

Krishna District Murder cases: చిన్న క్లూతో వీడిన కేసుల చిక్కుముడి.. రెండు మర్డర్ కేసులను ఛేదించిన పోలీస్ కానిస్టేబుల్స్

OLA e Scooter: రెండు రోజులు.. 1100 కోట్లు.. చరిత్ర సృష్టించిన ఓలా స్కూటర్! మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే..