Female Dog Handler: మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏమి లేదు.. ఇల్లాలిగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే.. తాను ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తూ.. తనకంటూ ఓ ఫేమ్ ను సొంతం చేసుకుంటుంది. కదన రంగంలో కాలు పెట్టింది.. అంబరాని అందుకుంది. అన్నింటా తనకంటూ పేజీ లిఖించుకుంటూ.. ఆధునిక యుగంలో కాలంతో పాటు పరుగులు పెడుతుంది. ఓ మహిళపోలీస్ డాగ్ స్క్వాడ్ లో ఉద్యోగం సంపాదించుకోవడమే కాదు.. ఆ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చే విధి నిర్వహణలో పురుషులతో సమానంగా పేరు గాంచింది. ఆమె పుణెకు చెందిన మొదటి పోలీసు మహిళా కుక్కల నిర్వహణ అధికారిగా రికార్డ్ కెక్కింది. వివరాల్లోకి వెళ్తే..
పూణేలోని పోలీసుల మొదటి మహిళా కుక్కల నిర్వహణ చేపట్టిన మొదటి మహిళ దీప్తి అధవ్ రౌత్. వృత్తి పట్ల మక్కువ, అంకితభావం ఉన్న వ్యక్తిగా మంచి ఉదాహరణ. దీప్తి అధవ్ రౌత్ పట్టుదలకు మారు పేరు.. మొదటిసారి డాగ్ స్క్వాడ్ కు ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశారు.. అయినా దీప్తి నిరాశకు గురికాలేదు.. తన లక్ష్యం మరువలేదు.. మళ్ళీ ప్రయత్నించారు. చివరకు తాను అనుకున్న ఉద్యోగాన్ని పొందారు. దీప్తి కి పూణే పోలీసు డాగ్ స్క్వాడ్‌లో ఉద్యోగం లభించింది.
త్వరలో పదవీ విరమణ చేయనున్న దీప్తి.. కుక్కలతో కలిసి పని చేయడానికి ఇష్టపడుతారు. ఆమె మొదటిసారిగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు అందమైన నల్లని లాబ్రడార్ కుక్కను ఇచ్చారు, అప్పుడు దానికి ఆరేళ్ళ వయసు. అప్పుడు దీప్తి వీరుకు రెండవ హ్యాండ్లర్. దీప్తి 12 గంటల పాటు ఉద్యోగాన్ని నిర్వహింస్తుంది. మాదకద్రవ్యాల బృందంలో పనిచేసే వీరుని దీప్తి ఎంతో కేరింగ్ గా చూస్తుంది. దానితో రోజూ కసరత్తులు చేయిస్తుంది. మంచి ఆహారాన్ని అందిస్తుంది. తాను దత్తత తీసుకున్న కుక్క పిల్లను వదులుకోవాల్సి వచ్చిందని.. అప్పుడే ఈ ఉద్యోగం పై ఆసక్తి ఏర్పడిందని దీప్తి తెలిపారు. డాగ్ స్క్వాడ్ లో ఉద్యోగం చేయాలనే అలోచన ఏర్పడి.. జంతు శిక్షకురాలిగా శిక్షణ పొందినట్లు తెలిపారు. తాను ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వీరుని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పారు. తనకు ఇప్పుడున్న లక్ష్యం ఒకటే నని కొత్త కుక్కకు మొదటి హ్యాండ్లర్ కావడమే నని తెలిపారు దీప్తి. ఎక్కువ మంది మహిళలు జంతువులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగం కావాలని కోరుకుంటున్నారు దీప్తి.
Also Read: 5వ తరగతి పాసైన వారికి గుడ్ న్యూస్.. ఎటువంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం