
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన మర్చంట్ నేవి ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై మీరట్ నగర ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ మరిన్ని వివరాలు అందించారు. సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసిన తర్వాత అతని శరీర భాగాలను భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా ఏం చేశారనే సంచలన నిజాలు వెల్లడించారు. శరీర భాగాలలో ఒకదాన్ని ఒక సంచిలో ఉంచి, తల చేతులను సాహిల్ ఇంటికి తీసుకెళ్లింది. మరుసటి రోజు, సిమెంట్, డ్రమ్స్ కొనుగోలు చేశారు. డెడ్‌బాడీని ఎవ్వరూ గుర్తిపట్టకుండా ఉండేందుకు మెండెం నుంచి తల వేరు చేశారు.
అలాగే వేలిముద్రల సహాయంతో మృతదేహం ఎవరిదని కనుకొగకుండా ఉండేందుకు చేతులు మణికట్టు దగ్గర వేరు చేశారు. తల, చేతులను మృతదేహం నుంచి వేరు చేయడమే కాకుండా వాటిని మిక్సర్ గ్రైండర్‌లో వేసి నలిపివేశారని తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టంలో అనేక కోతలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. అయితే తల లేని డెడ్‌బాడీ గుర్తించడం కష్టం అవుతుందని అని గొంతు కోసి, తల నరికి చంపినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ టీం బెడ్‌షీట్‌లు, దిండులపై, అలాగే బాత్రూమ్ టైల్స్, ట్యాప్‌పై రక్తపు మరకలను కనుగొన్నారు. అంతేకాదు ఇన్వెస్టిగేషన్ అధికారులు క్రైమ్ సీన్ నుంచి ఓ ఒక సూట్‌కేస్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మొదట మృతదేహాన్ని పారవేసేందుకు ముస్కాన్, సాహిల్ సూట్‌కేసు తెచ్చి ఉంటారని, డెడ్‌బాడీ సూట్‌కేస్ లోపల పట్టకపోవడంతో ఖాళీ డ్రమ్‌లో వేసి దాని నిండా సిమెంట్ వేసి కప్పెట్టారని పోలీసులు చెబుతున్నారు. సూట్‌కేస్‌లో రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. ఈ కేసుతో నేరుగా సంబంధం ఉన్న దాదాపు 10, 12 మంది వ్యక్తుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. అన్ని ఆధారాలను సేకరించి, పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు, రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా, రాజ్‌పుత్ ఛాతీపై అనేకసార్లు కత్తితో పొడిచి, అతని శరీరాన్ని ముక్కలు చేసి సిమెంట్ నిండిన డ్రమ్ములలో దాచిపెట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.