ఇక మీడియాపై ఉక్కుపాదం !

| Edited By: Anil kumar poka

Oct 15, 2019 | 7:55 PM

దేశంలో శాంతి భద్రతలను చక్కబెడుతూ.. విదేశాల్లో జరిగే ఉగ్రవాద కుట్రల్ని మట్టుబెడుతూ.. అభినవ చాణక్యుడనిపించుకుంటున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ? ఇదిప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న పెద్ద చర్చ. ఈ చర్చకు మరింత ఊతమిచ్చేలా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో కలకలం సృష్టించాయి. ఎన్నో ఏళ్లుగా దేశ రక్షణ కోసం రకరకాల వేషభాషల్లో.. ధీరోదాత్తమైన సాహస ప్రయాణాలతో, చెక్కుచెదరని విశ్వాసంతో, అనితర సాధ్యమైన వ్యూహాలతో జీవితాన్ని దేశానికి […]

ఇక మీడియాపై ఉక్కుపాదం !
Follow us on

దేశంలో శాంతి భద్రతలను చక్కబెడుతూ.. విదేశాల్లో జరిగే ఉగ్రవాద కుట్రల్ని మట్టుబెడుతూ.. అభినవ చాణక్యుడనిపించుకుంటున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ? ఇదిప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న పెద్ద చర్చ. ఈ చర్చకు మరింత ఊతమిచ్చేలా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో కలకలం సృష్టించాయి.

ఎన్నో ఏళ్లుగా దేశ రక్షణ కోసం రకరకాల వేషభాషల్లో.. ధీరోదాత్తమైన సాహస ప్రయాణాలతో, చెక్కుచెదరని విశ్వాసంతో, అనితర సాధ్యమైన వ్యూహాలతో జీవితాన్ని దేశానికి అంకితమిచ్చిన అధికారి అజిద్ దోవల్. హిందువై వుండి.. పాకిస్తాన్ దేశంలో ఒక ముస్లింగా మూడేళ్లు రహస్య జీవితం గడిపారంటే ఆయన సాహసాన్ని ఎవ్వరూ కాదనలేరు.

అదే సమయంలో యురి సర్జికల్ స్ట్రైక్ అయినా.. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అయినా.. ఇటీవలి ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కాశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడమైనా అజిత్ దోవల్‌ ప్లానింగ్‌కు తిరుగు లేదన్న వాస్తవం వరుస ఉదంతాలతో ప్రూఫ్ అయ్యింది. అయితే తాజాగా అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు ? కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే వున్నట్లు సంకేతాలున్న నేపథ్యంలో అజిత్ దోవల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా మరేదైనా కొత్త టాస్క్ అప్పగించారా అన్నది ఇపుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న హాట్ హాట్ చర్చ.

ఈ చర్చలకు.. రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ అజిత్ దోవల్ తానే టాస్క్‌లో వున్నది చూచాయగా వెల్లడించారు. ఉగ్రవాద మూలాలు వ్యాప్తి చెందకుండా వుండాలంటే దేశంలోని మీడియా విధానాలు మారిపోవాలని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. సో.. దీన్ని బట్టి ఆయన మీడియాను కంట్రోల్‌లో పెట్టే బాధ్యతలను చేపట్టి వుంటారన్న కథనాలు మొదలయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజన నిర్ణయాల సమయంలో ఆల్ రెడీ మీడియా సంస్థలకు జాతీయ సమగ్రత దెబ్బతినకుండా వార్తా ప్రసారం చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ ఆదేశాల కారణంగా చాలా కంట్రోల్డ్‌గా వచ్చిన మీడియా కథనాలు.. దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా కాపాడాలయనే చెప్పాలి.

తాజాగా అజిత్ దోవల్ మరోసారి మీడియా విధానలపై ప్రకటన చేశారు. దేశంలో మీడియా ప్రసారాలు జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించకుండా వుండేలా విధివిధానాలు మార్చాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. సో.. అజిత్ దోవల్ తాజా టాస్క్ మీడియా కంట్రోల్ అని కథనాలు మొదలయ్యాయి. దీనిలో వాస్తవమెంతో.. భవిష్యత్‌లో మోదీ సర్కార్‌ మీడియా విధానాల మార్పిడిలో తీసుకోబోయే నిర్ణయాలే ఈ కథనాల్లో వాస్తవముందో లేదో తేలుస్తాయి.