గద్దెపై కొలువుదీరిన సారలమ్మ.. ఇవాళ సమ్మక్క ఆగమనం

అడవి బిడ్డల మహా జాతర కరీంనగర్‌ జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మేడారం జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం సారలమ్మను గద్దె వద్దకు తీసుకొచ్చారు. కోయ పూజారులు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో సాయంత్రం గం.5.10ని.లకు గద్దెపై కొలువుదీరింది సారలమ్మ. ఈ సందర్భంగా భక్తు ఘనస్వాగతం పలికి అమ్మవారిని దర్శకున్నారు. ఇక ఈ రోజు జాతరలో భాగంగా అసలు ఘట్టం జరగనుంది. నేడు గిరిజనుల ఇలవేల్పు సమక్క గద్దెలకు చేరనుంది. సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను పూజారులు […]

గద్దెపై కొలువుదీరిన సారలమ్మ.. ఇవాళ సమ్మక్క ఆగమనం

Edited By:

Updated on: Feb 06, 2020 | 8:46 AM

అడవి బిడ్డల మహా జాతర కరీంనగర్‌ జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మేడారం జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం సారలమ్మను గద్దె వద్దకు తీసుకొచ్చారు. కోయ పూజారులు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో సాయంత్రం గం.5.10ని.లకు గద్దెపై కొలువుదీరింది సారలమ్మ. ఈ సందర్భంగా భక్తు ఘనస్వాగతం పలికి అమ్మవారిని దర్శకున్నారు. ఇక ఈ రోజు జాతరలో భాగంగా అసలు ఘట్టం జరగనుంది. నేడు గిరిజనుల ఇలవేల్పు సమక్క గద్దెలకు చేరనుంది. సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను పూజారులు తీసుకురానున్నారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం గద్దెపై సమ్మక్కను ప్రతిష్టించనున్న పూజారులు. ఈ నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ సమ్మక్క రాకతో జాతర పతాకస్థాయికి చేరుకోనుంది. కాగా ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై మేడారం జాతరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇక వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో శివసత్తుల పూనకాల కోలాహలం నెలకొంది.