MAYAVATI ON TRENDING: అధికారంలో లేకున్నా అదే ఊపు.. జాతీయ రాజకీయాల్లో మాయావతి ప్రస్తుతం ట్రెండింగ్.. ఎందుకంటే?

|

May 17, 2021 | 2:08 PM

ఐదేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు. మొన్నామధ్య బెంగాల్ ఎన్నికల సందర్భంగా మాయావతి హల్‌చల్ చేస్తుందని అందరూ భావించినా...

MAYAVATI ON TRENDING: అధికారంలో లేకున్నా అదే ఊపు.. జాతీయ రాజకీయాల్లో మాయావతి ప్రస్తుతం ట్రెండింగ్.. ఎందుకంటే?
Follow us on

MAYAVATI ON TRENDING IN NATIONAL POLITICS: ఐదేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్ (UTTAR PRADESH) ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఎస్పీ అధినేత్రి (BSP CHEIF) మాయావతి పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు. మొన్నామధ్య బెంగాల్ ఎన్నికల (BENGAL ELECTIONS 2021) సందర్భంగా మాయావతి హల్‌చల్ చేస్తుందని అందరూ భావించినా అందుకు భిన్నంగా ఆమె తెరచాటుకే పరిమితమయ్యారు. కానీ తాజాగా ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియా (SOCIAL MEDIA)లోకి దూసుకొచ్చారు. దూసుకు రావడమే కాదు ఏకంగా ట్రెండింగ్ (TRENDING) లో నెంబర్ వన్ గా నిలిచారు. రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అణగారిన వర్గాలకు సాధికారత పంచడంలో, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. రాజకీయ పార్టీలు, నేతలతో పాటు సోషల్ మీడియాను వినియోగించుకునేవారి సంఖ్య పెరగడంతో ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి, అతి తక్కువ ఖర్చుతో చేరవేయాలంటే సోషల్ మీడియాను మించింది లేదు.

తాజాగా సోషల్ మీడియా ట్రెండింగ్‌లో మొట్టమొదటిసారి మాయావతి దూసుకుపోయారు. ఇంతకుముందెప్పుడు ఇలాంటి ట్రెండింగ్‌లో ఆమె కనిపించలేదు. బీఎస్పీ కార్యకర్తలు, మద్దతు దారులు నేషన్ వాంట్స్ బెహెన్ జీ (NATION WANTS BEHAN JEE) అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు. చూస్తుండగానే ఇండియా ట్రెండ్స్‌ (INDIA TRENDS)లో నంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. ఇప్పటికి ఈ హ్యాష్‌ట్యాగ్‌ (HASHTAG)పై 90 లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్రెండింగ్ ద్వారా రోజు వారి అంశాలు తెలుస్తుంటాయి. ఈ విషయంలో సోషల్ మీడియా విభాగాల్లో ట్విట్టర్‌పై ఎక్కువ మందికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న అంశాలను బట్టి రాజకీయ సమీకరణలు కూడా మారతుంటాయంటే అతిశయోక్తి కాదు. యువతరాన్ని, అభివృద్ధిని ఆశించే మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా అనువైన వేదిక అని అన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. నేటి సాంకేతిక ప్రపంచంలో కమ్యూనికేషన్ల ద్వారా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి సులభం అయింది. ప్రభుత్వ అధికారిక ప్రకటనలు కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇక విమర్శ ప్రతివిమర్శలు కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషయం తెలియనిది. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాయి. ముఖ్యంగా బీజేపీ (BJP), కాంగ్రెస్ (CONGRESS PARTY), ఆప్ (AAP) పార్టీలకు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.

ALSO READ: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. తగ్గేదే లేదంటున్న ఇజ్రాయిల్.. రంగంలోకి యుఎన్ఓ