17 ఏళ్ల బాలుడితో ఏకాంతంగా వివాహిత.. సడెన్‌గా ఇంట్లోకి వచ్చిన బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తమ వివాహేతర సంబంధం బయటపెడుతుందనే అనుమానంతో ఒక వివాహిత, తన ప్రియుడైన 17 ఏళ్ల బాలుడితో కలిసి ఆరేళ్ల బాలికను హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని సంచిలో కుక్క బావిలో పడేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

17 ఏళ్ల బాలుడితో ఏకాంతంగా వివాహిత.. సడెన్‌గా ఇంట్లోకి వచ్చిన బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?
UP Crime

Updated on: Sep 07, 2025 | 5:08 PM

తమ వివాహేతర సంబంధం బయటపెడుతుందనే అనుమానంతో ఒక వివాహిత, తన ప్రియుడైన 17 ఏళ్ల బాలుడితో కలిసి ఆరేళ్ల బాలికను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల వివాహిత మహిళకు స్థానికంగా నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువకుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారి.. అది కాస్తా వివాహేతర సంబందానికి దారి తీసింది.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 4న భర్తతో పాటు అత్త బయటకు వెళ్లడంతో.. ఇదే అదునుగా భావించిన వివాహిత.. తన ప్రియుడైన 17 ఏళ్ల యువకుడ్ని తన ఇంటికి పిలిపించుకుంది. అయితే ఇద్దరూ సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు సడెన్‌గా ఇంట్లోకి.. పక్కనే ఉండే ఒక ఆరేళ్ల బాలిక వచ్చింది. అది గమనించిన ఇద్దరూ ఈ విషయం వెవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించారు. అయితే బాలికి తన తండ్రికి చెబుతానని చెప్పడంతో ఇద్దరూ బయపడిపోయారు. ఏం చేయాలో అర్థం కాక ఇద్దరూ కలిసి బాలిక గొంతునొక్కి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి సమీపంలోని పాడుబడిన బావిలో పడేశారు.

అయితే రాత్రైనా కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు చిన్నారి కోసం వెతకడం స్టార్ట్‌ చేశారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సమీపంలోని బావిలో దుర్వాసన రావడాన్ని గమనించిన వారు బావిలోని సంచిలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే బాలిక గొంతుకు గుడ్డ చుట్టి ఉండటాన్ని చూసి పోలీసులు, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఎవరో బాలికను హత్య చేసి బావిలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తి చేశారు.

ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. పెనుగులాట సమయంలో బాలికన మహిళ చేతిపై కొరికిన గుర్తుల ద్వారా నిందితురాలిని పోలీసులు పట్టుకొన్నారు. అమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వివాహితతో పాటు 17 ఏళ్ల యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.