Viral News: అమ్మాయితో లేచిపోయిన యువకుడు.. కోర్టు ఇచ్చిన షాక్‌కు బిత్తరపోయాడు..!

|

Apr 20, 2022 | 10:59 PM

Viral News: ఏడు నెలల క్రితం అమ్మాయితో కలిసి పారిపోయిన యువకుడికి గుజరాత్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వారి ఆచూకీని కనిపెట్టేందుకు అయిన...

Viral News: అమ్మాయితో లేచిపోయిన యువకుడు.. కోర్టు ఇచ్చిన షాక్‌కు బిత్తరపోయాడు..!
Couple
Follow us on

Viral News: ఏడు నెలల క్రితం అమ్మాయితో కలిసి పారిపోయిన యువకుడికి గుజరాత్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వారి ఆచూకీని కనిపెట్టేందుకు అయిన ఖర్చు మొత్తంలో సగం సొమ్మును చెల్లించాలని ఎవరికోసం అయితే వెతికారో సదరు వ్యక్తిని ఆదేశించింది. దాంతో అతను బిత్తరపోయాడు. రాజ్‌కోట్ నగరానికి చెందిన రఘుభాయ్ పర్మార్.. అదే ప్రాంతంలోని 20 ఏళ్ల యువతితో 2021లో ఇంటి నుంచి పారిపోయాడు. దాంతో తన కుమార్తె కనిపించడం లేదని, ఆచూకీ కనిపెట్టి తనకు అప్పగించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు ఏడు నెలల పాటు వారి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆమెకు తన తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. పర్మార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పర్మార్‌కు అప్పటికే వేరొక మహిళతో వివాహం జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేశారు.

ఈ కేసును విచారించిన ధర్మాసం.. షాకింగ్ తీర్పునిచ్చింది. ఈ కేసులో మహిళను కనిపెట్టి తిరిగి తీసుకురావడానికి అయిన ఖర్చు మొత్తాన్ని ఫర్మార్ నుంచి వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఏడు నెలల సుదీర్ఘ విచారణలో పోలీసులు 17,170 గంటలు పని చేశారని రాజ్‌కోట్ పోలీసులు గుజరాత్ హైకోర్టుకు తెలిపారు. అలాగే 19 రోజుల పాటు జరిగిన విచారణ ఖర్చు రూ.42,500, అదనంగా కోర్టు ముందు భౌతికంగా హాజరు కావడానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.75,000. ఇక తన కూతురు ఆచూకీ కోసం వ్యక్తిగతంగా రూ.8.06 లక్షల ఖర్చు చేశానని మహిళ తండ్రి కోర్టుకు తెలియజేశారు. మొత్తంగా మహిళను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు అయిన మొత్తం ఖర్చు.. రూ. 11,17,500 ఫర్మార్ నుంచి వసూలు చేయాలని అధికారులను ఆదేశించింది గుజరాత్ కోర్టు. ఈ మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని రాఘుభాయ్ పర్మార్‌ను ఆదేశించింది కోర్టు. ఒకవేళ అతను ఆ మొత్తం డబ్బును చెల్లించని యెడల.. శిక్షార్హుడు అవుతాడని స్పష్టం చేసింది. పర్మార్ డబ్బు చెల్లించిన తరువాత దానిని రాజ్‌కోట్ సిటీలోని పోలీసు సంక్షేమ నిధిలో జమ చేయాలని కోర్టు ఆదేశించింది.

Also read:

Viral Video: డ్రైవర్ సాబ్ ఎంత పని చేశావయ్యా.. రిజర్వాయర్‌లో స్విమ్మింగ్ చేసిన కారు..!

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. రాబోయే మూడు రోజులు..

Healthy Sweeteners: చెక్కరకు బదులు వీటిని ఉపయోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!