దండకారణ్యంలో పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం.. సమావేశాల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఏం చెప్పారో తెలుసా?

ఛత్తీస్‌గడ్‌లోని దండకారణ్యంలో పీఎల్‌జీఏ 20వ వారోత్సవాలు ప్రారంభమైనట్లు సమావేశాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను మావోయిస్టు

  • uppula Raju
  • Publish Date - 2:05 pm, Thu, 3 December 20
దండకారణ్యంలో పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం.. సమావేశాల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఏం చెప్పారో తెలుసా?

Maoist PLGA Week: ఛత్తీస్‌గడ్‌లోని దండకారణ్యంలో పీఎల్‌జీఏ 20వ వారోత్సవాలు ప్రారంభమైనట్లు సమావేశాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను మావోయిస్టు నేతలు మీడియాకు విడుదల చేశారు. వార్షికోత్సవ ప్రారంభోత్సవాలకు భారీ సంఖ్యలో ఆదివాసీలు హాజరైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్, ఆజాద్‌లతో పాటు పలువురు మావోయిస్టు అగ్రనేతలు సమావేశాలకు హాజరై పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందినట్లు సమాచారం.

సమావేశాల్లో అమర వీరులను స్మరించుకొని పతాకవిష్కరణ చేసినట్లుగా చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే బీకేటీజీ కార్యదర్శి వార్షికోత్సవ రూపాన్ని ప్రకటన రూపంలో మీడియాకు విడుదల చేశారు. అమరుల కలలను సాకారం చేసుకునేందుకే పీఎల్‌జీఏ ఏర్పాటయిందని అందులో పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నాయని ఆరోపించారు. పోరాడే గొంతుకలను, ప్రశ్నించే గొంతుకలను అన్యాయంగా పొట్టన బెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రజలకు సేవ చేయాలని హితవు చెప్పారు. లేదంటే ప్రజాకోర్టులో శిక్షలు తప్పవని హెచ్చరించారు. మావోయిస్టు‌ల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక దళాలలను ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలన్నారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో ప్రజలందరు కలిసికట్టుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.