Farmers Protest: ఘాజీపూర్ బోర్డర్‌ను పరిశీలించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఆర్ఎల్‌డీ

వ్యవసాయ చ‌ట్టాల‌ను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు పార్టీలు సరిహద్దులకు..

Farmers Protest: ఘాజీపూర్ బోర్డర్‌ను పరిశీలించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఆర్ఎల్‌డీ

Updated on: Jan 29, 2021 | 12:15 PM

Farmers Protest Updates – Manish Sisodia: వ్యవసాయ చ‌ట్టాల‌ను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు పార్టీలు సరిహద్దులకు వెళ్లి రైతులతో మాట్లాడి మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారం ఘాజీపూర్ బోర్డర్‌ను పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. ముందునుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రైతుల ఉద్యమానికి మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఘాజీపూర్ బోర్డర్‌ను సందర్శించిన మనీష్ సిసోడియా రైతుల ఉద్యమం గురించి ఏం మాట్లాడకుండా.. కేవలం సౌకర్యాల పరిశీలనకే వచ్చానంటూ వెల్లడించారు. రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ తమకు మౌలిక వసతులను కల్పించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కోరారు. దీంతో రాత్రి మరుగుదొడ్లు, తాగునీటి వసతులను గత రాత్రి ఏర్పాటు చేశారని.. అవి ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు వచ్చానంటూ సిసోడియా మీడియాతో తెలిపారు.

రైతుల ఉద్యమానికి ఆర్‌ఎల్‌డీ మద్దతు..
ఇదిలాఉంటే..రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి) చీఫ్ అజీత్ సింగ్ రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన టికాయత్‌తో మాట్లాడారు. తమ పార్టీ అధినేత సూచనలతో ఆర్ఎల్డీ నాయకుడు జయంత్ చౌదరి కూడా ఘాజీపూర్ బోర్డర్‌కు చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులు ఉద్యమ స్థలాన్ని వీడకూడదంటూ వెల్లడించారు. అన్నిపార్టీలు పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తాలంటూ జయంత్ చౌదరి కోరారు.

Also Read:

Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి.. వెనక్కి తగ్గమంటున్న రైతులు.. భారీగా పోలీసుల మోహరింపు

Farmers Tractor Rally On Republic Day: గణతంత్రానికి గాయం..! దేశాన్ని అవమానించిన వీళ్లెవరూ..?