Bharat Jodo Nyay Yatra: ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రకు అనుమతి నిరాకరణ..!
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని , ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్ నుంచి యాత్రకు అనుమతి ఇవ్వలేదమని మణిపూర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి వెల్లడించింది. మణిపూర్ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది.

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జనవరి14 నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, యాత్రకు అనుమతి ఇవ్వలేమని మణిపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మణిపూర్ సర్కార్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారమే రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంఫాల్ లోని మరో ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు.
భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో మణిపూర్‌లో ప్రారంభమై ముంబైలో ముగియనున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఈ యాత్ర ప్రారంభం కాకముందే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి, యాత్ర ఎక్కడ నుండి ప్రారంభించాలో మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. ఈ యాత్ర జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. కానీ ఇప్పటికీ అనుమతి లేకపోవడంతో ప్రయాణం ప్రమాదంలో పడింది. మణిపూర్ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. ఇది రాజకీయ ప్రయత్నం కాదని, యాత్రను రాజకీయం చేయవద్దని ఆయన అన్నారు.
మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె మేఘచంద్ర, పార్టీ నేతల బృందంతో కలిసి బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను కలిశారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సాకుగా చూపుతూ భేటీ సందర్భంగా సీఎం అనుమతి నిరాకరించారని అన్నారు.
ఇదిలావుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు 6,500 కిలోమీటర్ల మేర సాగే ఈ చారిత్రాత్మక యాత్ర యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర దేశంలోని 15 రాష్ట్రాల గుండా ముంబయిలో ముగుస్తుంది. ఇప్పుడు ఈ యాత్ర మార్గంలో అరుణాచల్ ప్రదేశ్ కూడా చేర్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…