Viral: పైకేమో టిప్​టాప్ కూరగాయల వ్యాపారి.. కానీ.! లోన చేసేది చాటుమాటు యాపారం..

మత్తును కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు స్మగ్లర్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. వారి కళ్లుగప్పి ఎద్దేచ్చాగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

Viral: పైకేమో టిప్​టాప్ కూరగాయల వ్యాపారి.. కానీ.! లోన చేసేది చాటుమాటు యాపారం..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 10, 2024 | 12:53 PM

మత్తును కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు స్మగ్లర్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. వారి కళ్లుగప్పి ఎద్దేచ్చాగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ కూరగాయల వ్యాపారి.. పైకేమో పచ్చపచ్చని తాజా కూరగాయలను సప్లయ్ చేస్తూ.. లోన చాటుమాటుగా గంజాయి సప్లయ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. చివరికి ఊచలు లెక్కపెడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ముంబైలోని బోరివాలి వెస్ట్ ప్రాంతంలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ముంబై నార్కోటిక్స్ బృందం. వారి దగ్గర నుంచి రూ. 1.5 కోట్ల విలువైన రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెర్చ్ ఆపరేషన్‌లో స్థానికంగా కూరగాయలు అమ్ముతున్న లక్ష్మణ్ జైస్వాల్.. ఈ తతంగం అంతటికి ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడితో పాటు రోహిత్ గుప్తా అనే మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు.

తనకు డబ్బు అవసరం ఉండటం.. అలాగే ముంబైలో గంజాయికి డిమాండ్ ఎక్కువగా ఉందని తెలియడంతో.. అమ్మితే మంచి లాభాలు వస్తాయని అనుకున్నట్టు గుప్తా విచారణలో చెప్పాడు. ఈ క్రమంలోనే నేపాల్ సరిహద్దు వరకు వెళ్లి.. అక్కడ 2 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు గుప్తా. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం దాని విలువ రూ. 1.5 కోట్లు మించి ఉంటుందని అంచనా.

ఇక గుప్తా గంజాయి కొనుగోలు చేసే దగ్గరే.. జైస్వాల్‌ను కలుసుకోవడం.. వారిద్దరూ ఈ ప్లాన్‌ను ఒకరికొకరు పంచుకోవడం జరిగింది. ముంబైకి గంజాయి తీసుకొచ్చి విక్రయిద్దామని అనుకునేలోపే.. సదరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా, నేపాల్ బోర్డర్‌లో ఈ ఇద్దరికీ ఎవరు గంజాయి సప్లయి చేశారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.