నడుస్తున్న రైల్లో చలిమంట వేసుకున్న ప్రయాణికులు !! పొగలు రావడంతో ??
దేశవ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. పలు చోట్ల విపరీతంగా మంచుకురుస్తోంది. ఉదయం 8 గంటలైనా సూర్యుడి జాడ కనిపించడంలేదు. ఇక పొగ మంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారుల అవస్థలు చెప్పనక్కర్లేదు. ఇళ్లనుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. చలికి తట్టుకోలేక చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు ఏకంగా కదులుతున్న రైల్లోనే చలిమంటలు వేసి చలి కాచుకున్నారు.
దేశవ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. పలు చోట్ల విపరీతంగా మంచుకురుస్తోంది. ఉదయం 8 గంటలైనా సూర్యుడి జాడ కనిపించడంలేదు. ఇక పొగ మంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారుల అవస్థలు చెప్పనక్కర్లేదు. ఇళ్లనుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. చలికి తట్టుకోలేక చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు ఏకంగా కదులుతున్న రైల్లోనే చలిమంటలు వేసి చలి కాచుకున్నారు. రైలునుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అస్సాం నుంచి ఢిల్లీకి వెళుతోంది. అదే సమయంలో జనరల్ కోచ్ కంపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడాన్ని ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోచ్ వద్దకు చేరుకున్నారు. భోగిలో ఉన్న కొందరు వ్యక్తులు ఎంచక్కా చలి మంట కాచుకుంటున్నారు. ఈ సీన్‌ను చూసిన పోలీసులకు ఒక్కసారిగా ఫ్యూజుల్ అవుట్ అయ్యాయి. వెంటనే మంటలు ఆర్పించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారం కొనాలమ్మా… కొట్టేస్తే రాదు…
సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్
4వేల డాలర్లు నమిలేసిన శునకం..
ఆ రోజు 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వాళ్లకు మాత్రమే