జాతి వైరాన్ని మరిచి.. మాతృత్వాన్ని పంచిన శునకం
అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపునిండా అన్నం పెట్టగలిగేది అమ్మే. ఇది మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ జరుగుతుంది. తాజాగా ఓ శునకం జాతి వైరాన్ని మరచి మేక పిల్లను హక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం భగవాన్ పూర్ లో చోటు చేసుకుంది. అసలే ఈ మధ్య ఎక్కడ చూసినా మేకల మందలపై కుక్కల దాడి.. చిన్నారుల పై వీది కుక్కల దాడి..
అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపునిండా అన్నం పెట్టగలిగేది అమ్మే. ఇది మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ జరుగుతుంది. తాజాగా ఓ శునకం జాతి వైరాన్ని మరచి మేక పిల్లను హక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం భగవాన్ పూర్ లో చోటు చేసుకుంది. అసలే ఈ మధ్య ఎక్కడ చూసినా మేకల మందలపై కుక్కల దాడి.. చిన్నారుల పై వీది కుక్కల దాడి.. వార్తలే వినిపిస్తున్న ఈ సమయంలో మాతృత్వాన్ని చాటిన ఈ శునకం వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. జాతి వైరం మరిచి మాతృత్వపు మాధుర్యం పంచిన ఈ శునకం తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. భగవాన్ పూర్ గ్రామంలో యువరాజ్ అనే యువకుడికి చెందిన పెంపుడు శునకం మూడు పిల్లలకు జన్మ నిచ్చింది. తన పిల్లలకు ఆ శునకం పాలు ఇవ్వగా చూసిన మేక పిల్ల దగ్గరకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. ఆ శునకం కూడా ఏమీ అనకుండా తన పిల్లలతో పాటు ఆ మేక పిల్లకు సైతం చనుబాలు ఇచ్చి ఆకలి తీర్చింది. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్కటైన కోనసీమ కుర్రది.. స్పెయిన్ కుర్రాడు..
భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ
నిజామాబాద్‌లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం
KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా
Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

