Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Governor’s House: గవర్నర్‌ ఇంటి సమీపంలో గ్రనేడ్‌ కలకలం.. హెచ్చరిక నోట్‌.. అందులో ఏముందంటే..

గ్రనేడ్‌తో పాటు ఓహెచ్చరిక నోట్‌ కూడా లభ్యమైనట్లుగా అధికారులు తెలిపారు. గ్రనేడ్ సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు గవర్నర్ నివాసానికి మరింత గట్టి పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న

Governor's House: గవర్నర్‌ ఇంటి సమీపంలో గ్రనేడ్‌ కలకలం.. హెచ్చరిక నోట్‌.. అందులో ఏముందంటే..
Hand Grenade
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2024 | 6:24 PM

మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లోని ఓ కళాశాల గేట్‌ వద్ద గ్రనేడ్ కలకలం రేపింది. గవర్నర్‌ అధికార నివాసానికి కేవలం 200 మీటర్ల దూరంలో గ్రనేడ్‌ లభ్యమవ్వడంతో సంచలనం సృష్టిస్తోంది. గ్రనేడ్‌తో పాటు శ్రామికవర్గ విద్యార్థుల హక్కులను గౌరవించాలంటూ ఓ నోట్‌ కూడా లభ్యమైనట్లుగా అధికారులు తెలిపారు. గ్రనేడ్ సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు గవర్నర్ నివాసానికి మరింత గట్టి పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న జీపీ మహిళా కళాశాల గేట్ల ముందు హ్యాండ్ గ్రెనేడ్ కనిపించిందని పోలీసు అధికారులు తెలిపారు.

మణిపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంఫాల్‌లోని సెంట్రల్ జైలు రోడ్‌లోని జిపి మహిళా కళాశాల గేట్ సమీపంలో ఉదయం 6 గంటల సమయంలో పాదాచారులు గ్రెనేడ్‌ను గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఇంఫాల్ పోలీస్ స్టేషన్ నుండి ఒక బృందం మణిపూర్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS)తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుంది. BDS బృందం ఉదయం 6:40 గంటలకు విజయవంతంగా బాంబును నిర్వీర్యం చేసింది.

ఇవి కూడా చదవండి

ఉదయం 7:20 గంటలకు లాంఫెల్ గేమ్ విలేజ్ ప్రాంతంలో దాన్ని పడవేసినట్టుగా వెల్లడించారు. బాంబు ప్లేస్‌మెంట్ వెనుక ప్రమేయం ఉన్నవారి ఆచూకీ తెలియాల్సి ఉంది. తదుపరి విచారణ కోసం ఇంఫాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది .

హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్.. అసలు దొంగను పట్టించిన మంగళసూత్రం
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్.. అసలు దొంగను పట్టించిన మంగళసూత్రం
మరో వారం రోజుల్లో అదృష్టంపట్టబోయే రాశులు ఇవే..మీ రాశి ఉందా మరి!
మరో వారం రోజుల్లో అదృష్టంపట్టబోయే రాశులు ఇవే..మీ రాశి ఉందా మరి!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగానే..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగానే..
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం