Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ధాన్యం కాదు.. మధుమేహులకు వరం.. రోజూ తింటే ఆ సమస్యలన్నీ దూరం!

రాగులు చూసేందుకు ఆవాలు లాగే చిన్నగా, సన్నగా ఉంటాయి. కానీ, వీటిలో దాగివున్న పోషక విలువలు మాత్రం దండిగా ఉంటాయి. ఇక రాగులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రాగులను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలకుండా అలవాటు చేసుకుంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ.. రాగులలో ఎలాంటి పోషకాలుంటాయి? తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Oct 28, 2024 | 6:08 PM

Share
వైద్యుల ప్రకారం..ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాల్లో రాగులు ముందు వరుసలో ఉంటాయి. వీటిలో బి1, బి2, బి6, కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫొలేట్, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

1 / 6
Finger Millet

Finger Millet

2 / 6
రక్తహీనతతో బాధపడేవారికి ఇది సరైన ఆహారం. చర్మం ముడతలు పడదు. ముఖానికి కాంతి వస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అలాగే.. రాగులు క్రమం తప్పకుండా తింటే కావలసినంత క్యాల్షియం అందుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయని చెబుతున్నారు.

3 / 6
రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచి అవి బలంగా మారడానికి తోడ్పడతాయి. రాగి జావ‌ను తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

4 / 6
రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులకు దూరం చేస్తుంది. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది.

5 / 6
వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరానికి బలం, శక్తిని అందిస్తాయి. రాగుల్లో పాలిఫినోల్స్ వంటి యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరుస్తాయి. తద్వారా వృద్ధాప్య ప్రక్రియ తగ్గి నిత్య యవ్వనంగా ఉండొచ్చు.

6 / 6