Koppal Mango Mela: మామిడి మేళాలో 100 రకాల పండ్లు.. అందరిని ఆకర్షిస్తోన్న జపాన్ మియాజాకి.. ఒక పండు రూ. 40 వేలు

|

May 25, 2023 | 2:18 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొప్పల్ మామిడి మేళా-2023 మంగళవారం ప్రారంభమైంది. ఈ మేళాలో వందకు పైగా రకాల పండ్లతో కనువిందు చేస్తున్నాయి. యాభై ఒక్క మంది రైతులు స్థానికంగా లభించేవి,  దిగుమతి చేసుకున్న మామిడి రకాలను విక్రయించడానికి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. మే 31 వరకు ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో మేళా కొనసాగనుంది.

Koppal Mango Mela: మామిడి మేళాలో 100 రకాల పండ్లు.. అందరిని ఆకర్షిస్తోన్న జపాన్ మియాజాకి.. ఒక పండు రూ. 40 వేలు
Mango Mela
Follow us on

వేసవి సీజన్ వస్తే చాలు అందరి దృష్టి మామిడి పండ్ల రకవైపే.. పండ్లలో రారాజు మామిడిలో అనేక రకాలున్నాయి. రంగురంగుల మామిడి పండ్ల.. రకరకాల సైజులతో ఆహారప్రియులను ఆకరిస్తూ ఉంటాయి. అయితే కొన్ని రకాల మామిడి పండ్లు అత్యంత ఖరీదుతో సామాన్యులకు దూరంగా సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొప్పల్ మామిడి మేళా-2023 మంగళవారం ప్రారంభమైంది. ఈ మేళాలో వందకు పైగా రకాల పండ్లతో కనువిందు చేస్తున్నాయి. యాభై ఒక్క మంది రైతులు స్థానికంగా లభించేవి,  దిగుమతి చేసుకున్న మామిడి రకాలను విక్రయించడానికి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. మే 31 వరకు ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో మేళా కొనసాగనుంది.

జపాన్‌కు చెందిన ఖరీదైన మామిడి మియా జాకీ

ఈ అయితే మేళాలో అత్యంత ఖరీదైన మామిడి సందర్శకులను ఆకర్షిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపాన్ కు చెందిన మియాజాకి పండు కొలువుదీరింది. దీని ధర కిలో రూ. 2.70 లక్షలు. ఒక్క పండు ధర 40 వేల రూపాయలు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ మియా జాకీ పండు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మామిడి పండును చూడటానికి ప్రజలు బారులు తీరారు. జపాన్‌లో ఎక్కువగా పండే పండులో ఔషధ గుణాలున్నాయని తొలిసారిగా ఈ తరహా రకాన్ని ప్రవేశపెట్టినట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెప్పారు. ఈ మియా జాకీ పండు ఒక్కటి 15 వేల రూపాయలు పలుకుతుందని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణ ఉక్కుంద్ తెలిపారు.

ప్రస్తుతం కొప్పల్‌లో జరుగుతున్న మ్యాంగో మేళాకు మంచి స్పందన లభించింది. మ్యాంగో మేళాలో మామిడి అనేక రకాల ఉత్పత్తుల విక్రయిస్తున్నారు. బాన్ బంగినపల్లి, కలెక్టర్ మామిడి, సువర్ణ రేఖ, రసాలు, చిన్న రసాలు, చెరకు రసం, వంటి సుమారు 100 రకాల మామిడి పండ్లను సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఈ మేళాలో మామిడి ఉప ఉత్పత్తులు, విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నారు. మామిడి రోల్స్, మామిడి మసాలా, మామిడి గుజ్జు, మామిడి శ్రీఖండం వంటి వినియోగదారులకు తొలిసారిగా అందుబాటులో ఉంచారు. ఉద్యానవన శాఖ ప్రస్తుత ఏర్పాటు చేసిన ఈ మామిడి మేళా జిల్లా రైతులకు లాభదాయకమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..