మంగళూరు ఆటో బ్లాస్ట్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ కనిపిస్తోంది. కుక్కర్ బాంబ్‌తో ఆటోలో ప్రయాణించిన వ్యక్తి ప్రేమ్ రాజ్ కాదని తేల్చారు. ఆటోలో దొరికిన ఆధార్ కార్డ్ వివరాల ఆధారంగా హుబ్లీలోని ఓ ఇంటికి వెళ్లారు పోలీసులు. ఆ ఇంట్లో అసలైన ప్రేమ్‌రాజ్‌ను గుర్తించారు. ఆధార్‌కార్డ్‌లో ఉన్న వ్యక్తి ప్రేమ్‌రాజ్ హుతగీ రైల్వే ఉద్యోగిగా ఐడెంటిఫై చేశారు. కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ప్రేమ్ రాజ్ హుతగీ ఆధార్ కార్డ్ పోయింది. అదే ఆధార్ కార్డ్ నిందితుడికి దొరికింది. దాంతోనే మైసూర్, మంగళూరులో ఇళ్లను అద్దెకు తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. తాజాగా నిందితుడిని షరీఖ్‌గా గుర్తించారు పోలీసులు. పీఎఫ్‌ఐ సంస్థతో షరీఖ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2020లో కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద షరీఖ్ అరెస్టయ్యాడు. సాంకేతిక కారణాల వల్ల బెయిల్‌పై విడుదలయ్యాడు. పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో అతడు తిరిగాడు. ఇదే కేసులో తమిళనాడు లోని ఊటిలో మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళూరులో ఆటో బ్లాస్ట్ యాక్సిడెంటల్ కాదూ.. యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని తేల్చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కోయంబత్తూర్ కారు పేలుడుతో లింక్‌లు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రెండు ఘటనల వెనుక టెర్రర్ యాంగిల్ ఉన్నట్టు క్లియర్‌గా తెలుస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్‌కి వ్యతిరేకంగానే టెర్రర్ ఎటాక్స్ జరుగుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే టెర్రర్ మూక నెక్స్ట్ స్పాట్ ఎక్కడ పెట్టిందన్నది ఆందోళన కనిపిస్తోంది.
నిందితుడు.. ప్రేమ్‌రాజ్ పేరుతో దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు కన్‌ఫామ్ అయింది. బస్సులో దొరికిన ఆధార్ కార్డ్‌తో కోయంబత్తూర్‌లో సిమ్‌కార్డ్ తీసుకున్నాడు. అలాగే అద్దె ఇల్లు కూడా తీసుకున్నాడు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను బ్యాన్ చేయడంతో దాడులకు ప్లాన్ చేశాడు. అయితే ఆధార్ కార్డ్ దొరకడం నిందితుడికి వరంగా మారింది. ప్రస్తుతం గాయాలతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అతను నోరు విప్పితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా ఈ పేలుడు ఘటననను ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగానే భావించారు. కానీ.. కుక్కర్, అందులో బ్యాటరీలు లాంటివి చూశాక టెర్రర్ లింక్‌పై దృష్టి పెట్టారు. ప్రాథమిక విచారణలోనే పేలుడు వెనుక ఉగ్రకోణం కన్ఫామ్ అయ్యింది. వెంటనే DGP దీనిపై ప్రకటన చేశారు. యాక్ట్ ఆఫ్ టెర్రర్‌గా దీన్ని గుర్తించిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరారు. NIA కూడా వెంటనే రంగంలోకి దిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..