Man Vs Wild: డేరింగ్ మోదీ.. మొసలితో ఆటలు..!

Man VS wild:  బేర్‌గ్రిల్స్‌ అనే సాహసకారునితో డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసే షో ‘Man Vs Wild’. అతను అడవిలో సాహసయాత్ర చేస్తూ కష్టసమయంలో మనకు మనం ఎలా సర్వైవ్ అవ్వాలో ప్రేక్షకులకు వివరిస్తుంటాడు. ఇక అతనితో పాటు సాహసయాత్రను ప్రధాని నరేంద్ర మోదీ పంచుకోగా.. దానికి సంబంధించిన ఎపిసోడ్‌ను నిన్న రాత్రి టెలికాస్ట్ చేశారు. దీనిలో భాగంగా మోదీ తన చిన్నప్పుడు జరిగిన చిలిపి సంఘటనలను షో ద్వారా వెల్లడించారు. చిన్నతనంలో తాను ఓసారి […]

Man Vs Wild: డేరింగ్ మోదీ.. మొసలితో ఆటలు..!

Updated on: Aug 13, 2019 | 1:31 PM

Man VS wild:  బేర్‌గ్రిల్స్‌ అనే సాహసకారునితో డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసే షో ‘Man Vs Wild’. అతను అడవిలో సాహసయాత్ర చేస్తూ కష్టసమయంలో మనకు మనం ఎలా సర్వైవ్ అవ్వాలో ప్రేక్షకులకు వివరిస్తుంటాడు. ఇక అతనితో పాటు సాహసయాత్రను ప్రధాని నరేంద్ర మోదీ పంచుకోగా.. దానికి సంబంధించిన ఎపిసోడ్‌ను నిన్న రాత్రి టెలికాస్ట్ చేశారు. దీనిలో భాగంగా మోదీ తన చిన్నప్పుడు జరిగిన చిలిపి సంఘటనలను షో ద్వారా వెల్లడించారు. చిన్నతనంలో తాను ఓసారి మొసలిని పట్టుకున్నానని.. అయితే తన తల్లి మందలించడంతో దానిని తిరిగి చెరువులో వదిలేసినట్లు చెప్పారు.

చిన్న వయసులో తాను ఎప్పుడూ మురికి బట్టలు ధరించేవాడినని.. కానీ స్కూల్‌కి మాత్రం నీట్‌గా రెడీ అయ్యేవాడినని మోదీ చెప్పారు. ఇస్త్రీ కోసం రాగి చెంబులో నిప్పులు వేసుకుని దానితో చేసుకునేవాడినని అన్నారు. కాగా, ప్రధాని మోదీ పాల్గొన్న ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోని 12 ఛానెళ్ల ద్వారా 180 దేశాల్లో ప్రసారం చేశారు.