వెరైటీ నిరసన.. స్కూటర్‌ వెనుక జిన్‌పింగ్ ఫోటో.. ఫోటోకు చెప్పుల దండ..

సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న సంఘటన గురించి తెలిసిందే. సోమవారం రాత్రి జిత్తులమారి నక్కలా డ్రాగన్ సైనికులు...

వెరైటీ నిరసన.. స్కూటర్‌ వెనుక జిన్‌పింగ్ ఫోటో.. ఫోటోకు చెప్పుల దండ..

Edited By:

Updated on: Jun 20, 2020 | 7:01 PM

సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న సంఘటన గురించి తెలిసిందే. సోమవారం రాత్రి జిత్తులమారి నక్కలా డ్రాగన్ సైనికులు భారత సైన్యంపై ఇనుపచువ్వలు ఉన్న రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 భారత జవాన్లు వీరమరణం పొందారు. అటు చైనా వైపు కూడా 30 మంది సైనికులు మరణించినట్లు ప్రకటించింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా చైనాపై తీవ్ర వ్యతిరకత మొదలైంది. దేశ వ్యాప్తంగా చైనాకు చెందిన వస్తువులను కాల్చుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వెరైటీ స్టైల్‌లో నిరసన తెలిపాడు. తన స్కూటర్‌ వాహనానికి వెనుకాల చైనా అధ్యక్షుడి ఫ్లెక్సీని పెట్టి.. దానికి చెప్పుల దండ వేసి తన నిరసనను తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. అతడి దేశ భక్తికి హ్యాట్సాఫ్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.