Kerala man protest :ఈ వర్షాకాలంలో వరదలు, బురదమయమైన రోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలిపిందేకు ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. ఎడతెరిపి వర్షాలకు అక్కడి రోడ్లన్నీ గుంతలు గుంతలుగా మారాయి. ఎటు చూసినా వరదనీరు నిలిచిపోయి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దాంతో ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఏర్పడ గుంతలోనే స్నానం చేయడం, బట్టలు ఉత్తుకోవడం, యోగా వంటి పనులు చేస్తూ వెరైటీగా నిరసన వ్యక్తం చేశాడు. సర్కార్‌కు కనువిప్పు కలగాలని అతడు చేసిన వినూత్న కార్యక్రమాన్ని స్థానికులు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడయాలో అప్‌లోడ్ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగింది..అన్న విషయంలోకి వెళితే..
కేరళలోని మలప్పురంలో ఓ వ్యక్తి రోడ్డు గుంతలతో నిండిన నీటితో స్నానం చేసి నిరసన తెలిపాడు. కేరళలోని పాండిక్కాడ్ జిల్లా మలప్పురానికి చెందిన యువకుడు వర్షంతో రోడ్డుపై నిలిచిన మురికి నీళ్లలోనే స్నానం చేశాడు. అక్కడే యోగా చేస్తూ..అందరిని ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే..సంఘటనా స్థలం గుండా వెళుతున్నారు. అలా రోడ్డు మీద కూర్చున్న నజీమ్ ని చూసి కారు ఆపి నజీమ్ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. దీంతో నజీమ్ ఇక్కడి సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. అతడితో పాటు అక్కడ భారీగా గుమిగూడిన స్థానికులు సైతం ఎమ్మెల్యేను చుట్టుముట్టారు.
తమ సమస్యలు వెంటనే పరిష్కారించాలని డిమాండ్ చేశారు..దాంతో దిగొచ్చిన ఎమ్మెల్యే రహదారుల మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నజీమ్ చేసిన ఈ అపూర్వ నిరసన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వినూత్న నిరసనతో ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించిన సామాజిక కార్యకర్త హమ్జా పోరాలి కేరళలో ఇప్పుడు రియల్ హీరోగా మారారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి