Watch Video: ఓర్నీ పైత్యం తగలెయ్యా.. ఇదేం రీల్స్‌ పిచ్చిరా.. రైల్వే ట్రాక్‌పై పడుకొని రీల్స్‌.. కట్‌చేస్తే..

యువతలో రోజురోజుకూ రీల్స్‌ పిచ్చి పీక్స్‌కు చేరుకుంటుంది. ఆన్‌లైన్‌లో ఫేమస్‌ అయ్యేందుకు ప్రమాదకర రీల్స్‌ చేస్తూ ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. ఇలా రోజూ ఎక్కడో అక్కడ ప్రాణాలు కోల్పోతున్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఒక యువకుడు రైలు పట్టాలపై పడుకొని తనపై నుంచి ట్రెన్‌ వెళ్తున్న వీడియోను చిత్రీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో యువకుడి తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Watch Video: ఓర్నీ పైత్యం తగలెయ్యా.. ఇదేం రీల్స్‌ పిచ్చిరా.. రైల్వే ట్రాక్‌పై పడుకొని రీల్స్‌.. కట్‌చేస్తే..
Viral Video

Updated on: Sep 12, 2025 | 1:24 PM

ట్రైన్‌ వస్తుండగా ఒక యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకొని రీల్స్‌ చేస్తున్న కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక యువకుడు ఎదురుగా ట్రైన్‌ వస్తుండగా పట్టాలపై పడుకొని ట్రైన్‌ తన మీద నుంచి వెళ్తుండగా వీడియో చిత్రీకరించమని మరో యువకుడికి చెప్పాడు. సరిగ్గా ట్రైన్‌ వస్తున్న క్రమంలో పట్టాల పడుకొని.. ట్రైన్‌ తన మీద నుంచి వెళ్లి పోయిన తర్వాత పైకి లేచి గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ వీడియోను ఇన్‌స్ట్రా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

అయితే ఈ వీడియో వైరల్ అయితే తాను ఫేమస్‌ అవుతా అనుకున్నాడు యువకుడు. అతను నుకున్నట్టే ఫేమస్ అయ్యాడు. కానీ మరో విధంగా అతను పోస్ట్ చేసిన వీడియో కొద్ది గంట్లోనే లక్షల వ్యూవ్స్‌ను సంపాదించింది. అయితే ఈ వీడియోకి ఎన్ని లైక్స్‌ వచ్చాయో విమర్శలు కూడా అదే స్తాయిలో వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు అందరూ యువకుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షణాల వీడియో కోసం ప్రాణాలు పనంగా పెట్టడమేంటని సీరియస్ అయ్యారు.

ఒక వ్యక్తి కామెంట్ చేస్తూ.. ఈ రోజుల్లో ఇలాంటి రీల్స్‌ చేయడం యువతకు ఫ్యాషన్ అయిపోయింది. ప్రస్తుతం మీరు ఎక్కడ చూసినా, ప్రజలు ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తున్నారు అని రాసుకొచ్చాడు. దేశంలో అందుబాటులోకి వచ్చిన రీల్స్‌ సంస్కృతి యవతలో ఇలాంటి ప్రవర్తను ఆజ్యం పోస్తుందని..ఈ రీల్స్‌ సంస్కృతి దేశ శ్రేయస్సును నాశనం చేయడమే కాకుండా..నిజమైన విలువైన కంటెంట్‌ను ప్లేస్‌ను ఆక్రమిస్తుందని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. మొత్తానికి ప్రభుత్వ స్థలాల్లో ఇలాంటి ప్రమాదకర స్టంట్స్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

వైరల్‌ వీడియోను చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.