Sarayu River: ఓ జంట ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లింది. అక్కడ ప్రవేహించే పవిత్ర నది స్నానం చేసేందుకు ఆ దంపతులిద్దరూ దిగారు. స్నానం చేస్తున్న క్రమంలో భర్త.. భార్యకు ముద్దు పెట్టాడు. ఇది గమనించిన కొందరు అతనిపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవిత్ర నదిలో స్నానం చేస్తూ.. ఇదేం పద్దతి అంటూ అక్కడున్న వారు అతన్ని తిట్టడంతో పాటు చేయి చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో చోటుచేసుకుంది. అయోధ్యలో ప్రవహించే పవిత్ర నది సరయూలో దంపతులు స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
నదిలో స్నానం చేస్తూ భర్త తన భార్యకు ముద్దుపెట్టడాన్ని చూసిన కొందరు.. అతన్ని బయటకు లాగి కొడుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు. అయోధ్యలో ఇలాంటి అసభ్యతను సహించబోమంటూ అక్కడున్న వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో భార్య.. తన భర్తను రక్షించడానికి ప్రయత్నిస్తుంది కానీ.. అప్పటికే చాలామంది గుమిగూడటంతో ఏం చేయలేకపోతుంది. అలా కొడుతూ అతన్ని తీసుకెళ్లడాన్ని వీడియోలో చూడవచ్చు.
వీడియో..
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022
కాగా. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అయోధ్య పోలీసులకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అయోధ్య పోలీసులు ట్వీట్‌లో తెలిపారు.
గంగా నది.. ఏడు ఉపనదులలో సరయు నది ఒకటి. దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. రాముడి జన్మస్థలం అయోధ్య సరయు నది ఒడ్డున ఉండటంతో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి.. పూజలు చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..