
ఏ పనైనా చేసే ముందు అది మంచో చెడో ఆలోచించాలి. కొన్ని పనులు చేయకూడదని తెలిసినా కొంతమంది అలాంటి పనులే చేస్తుంటారు. సాధారణంగా పశువులను ఇబ్బంది పెట్టకూడదు. జంతువులకు ఆగ్రహం వస్తే దానిని మనుషులు తట్టుకోలేరు. చిన్న చిన్న జంతువులు అయితే వాటి బారినుంచి తప్పించుకోవచ్చు. అదే పెద్ద జంతువులు అయితే తప్పించుకోవడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అచ్చం అలాంటిదే. ఓ వ్యక్తి ఆ కారణంగా ఆవును ఇబ్బంది పెట్టాడు. మొదట ఎంతో శాంతంగా ఉన్న ఆవును తన్నడం, తోక లాగడం చేయడంతో ఆ సాధు జంతువు కూడా తిరగబడింది. అందుకే అంటారు మంచైనా, చెడైనా చేసిన పనికి ఫలితం అనుభవించే తీరాలి అని. దానినే కర్మ ఫలం అంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఇది కూడా. ఓ వ్యక్తి చేసిన పనికి వెంటనే కర్మఫలం అనుభవించాడు. నిర్దాక్షిణ్యంగా మూగ జీవిని హింసించాడు. వెంటనే రివెంజ్ తీర్చుకుంది ఆ సాధుజంతువు. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు, బలహీనులుగా అస్సలు భావించకూడదు.
నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వీధిలో ఇద్దరు వ్యక్తులు ఓ ఆవును ఎక్కడికో తోలుకెళ్తున్నారు. ఆవు మెడలో ఓ తాడు కట్టిఉంది. దానిని పట్టుకొని ముందు ఒక వ్యక్తి నడుస్తుంటే అతని వెంటే నడుస్తుంది ఆవు. దాని వెనుక మరో వ్యక్తి కర్ర పట్టుకుని ఆవును అదిలిస్తూ నడుస్తున్నాడు. ఏమైందో ఓ చోటకు వచ్చేసరికి ఆవు అక్కడ ఆగింది. దాంతో వెనుక కర్రపట్టుకుని వస్తున్న వ్యక్తి దానిని కొట్టాడు. కాలితో తన్నాడు. అంతేకాదు దాని తోకపట్టుకొని గట్టిగా మెలితిప్పుడూ హింసించాడు. దాంతో సహనం కోల్పోయిన ఆ ఆవు వెంటనే అతనిపై తిరగబడింది. కిందపడేసి కుమ్మేసింది. ఆవు ఆగ్రహానికి ముందు తాడుపట్టుకున్న వ్యక్తికూడా భయంతో తాడును వదిలేసాడు. దాంతో తనను కొట్టిన వ్యక్తికి బుద్ధి చెప్పింది ఆవు. ఈ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
ఆవుపట్ల ఆ వ్యక్తి తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. సాధు జంతువును హింసిస్తే కర్మఫలం అలాగే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే స్పష్టత లేనప్పటికి.. భారత్ లోనే జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువకుడు బతికి ఉండకపోవచ్చని కొందరు అంటే.. ఆ యువకుడి ప్రవర్తనే ఈ స్థితికి కారణమని మరికరొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.
Kalesh With Animal (Cow-Gang Assemble ?) pic.twitter.com/JaOHU7WjRo
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 13, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..