రోడ్డు మీదే ‘ చంద్రుని గుంతలు ‘.. ‘ డూప్లికేట్ వ్యోమగామీ ‘ ! నీకివే వందనాలు !

| Edited By: seoteam.veegam

Sep 06, 2019 | 12:40 PM

చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా చంద్రునికి దాదాపు దగ్గరగా ల్యాండ్ అయింది ‘ ఇస్రో ‘ ఉపగ్రహం. చంద్రుని మీది వలయాకారపు గుంతలు, ఎగుడుదిగుడు ప్రాంతాలను అప్పుడే రోవర్ తన కెమెరాలకెక్కిస్తూ భూమ్మీదికి పంపుతోంది. అయితే చంద్రుని మీదే కాదు.. మన భూతలంపై గల రోడ్లు కూడా ఇందుకు అతీతమేమీ కాదంటున్నాడో వ్యక్తి. ఇందుకు ఓ సరదా అయిన, వినూత్నమైన ఐడియాను ఎంచుకున్నాడు. అచ్ఛు వ్యోమగామిలా తెల్లని స్పేస్ సూట్ లాంటిది వేసుకుని, తలపై హెల్మెట్ ధరించి […]

రోడ్డు మీదే  చంద్రుని గుంతలు ..  డూప్లికేట్ వ్యోమగామీ  ! నీకివే వందనాలు !
Follow us on

చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా చంద్రునికి దాదాపు దగ్గరగా ల్యాండ్ అయింది ‘ ఇస్రో ‘ ఉపగ్రహం. చంద్రుని మీది వలయాకారపు గుంతలు, ఎగుడుదిగుడు ప్రాంతాలను అప్పుడే రోవర్ తన కెమెరాలకెక్కిస్తూ భూమ్మీదికి పంపుతోంది. అయితే చంద్రుని మీదే కాదు.. మన భూతలంపై గల రోడ్లు కూడా ఇందుకు అతీతమేమీ కాదంటున్నాడో వ్యక్తి. ఇందుకు ఓ సరదా అయిన, వినూత్నమైన ఐడియాను ఎంచుకున్నాడు. అచ్ఛు వ్యోమగామిలా తెల్లని స్పేస్ సూట్ లాంటిది వేసుకుని, తలపై హెల్మెట్ ధరించి ఓ రోడ్డుపైని గుంతల్లో అడుగులో అడుగు వేసుకుంటూ.. పెద్ద బిల్డప్ ఇఛ్చి కొంతదూరం నడిచాడు. బెంగుళూరులో.. ఎక్కడికక్కడ చిన్నపాటి ‘ గొయ్యిల్లాంటి ‘ గుంతలతో ‘ అలరారుతున్న ‘ తుంగానగర్ రోడ్డుపై అతగాడిలా నడుస్తుండగానంజుండ స్వామి అనే అతని స్నేహితుడు వీడియో తీసి వదిలాడు. పక్కన కార్లు, ఇతర వాహనాలు రయ్యిమని వెళ్తుండగా ఆ ‘ డూప్లికేట్ ఏస్ట్రోనట్ ‘ ఇలా తన వెరైటీ నిరసన తెలిపాడు. నిముషం నిడివి గల ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసాడు నంజుండస్వామి. అంతే! ‘ ఇస్రో తన వ్యోమగాములను ఈ రోడ్లపై నడిచేలా శిక్షణ ఇస్తే 2022 లో సక్సెస్ ఫుల్ మూన్ మిషన్ మన సొంతం కాదేంటీ’ అని యూజర్లు తెగ సెటైర్లు వేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.