Assassination: మైసూరులో దారుణం.. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరకు ఇలా చేశాడు..

|

Jan 19, 2021 | 8:06 AM

Assassination: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రాక్షసుడిలా మారాడు. నిద్రిస్తున్న భార్య మెడపై కాలుతో తొక్కి చంపేశాడు. ఈ దారుణ

Assassination: మైసూరులో దారుణం.. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరకు ఇలా చేశాడు..
Follow us on

Assassination: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రాక్షసుడిలా మారాడు. నిద్రిస్తున్న భార్య మెడపై కాలుతో తొక్కి చంపేశాడు. ఈ దారుణ ఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు కల్కుణికె హోసింగ్‌ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రవి, మృతురాలు సౌమ్యలకు పదకొండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.

కొన్ని రోజులుగా వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. కానీ ఇటీవల రవి భార్యపై అనుమానం పెంచుకొని గొడవ పడటం మొదలుపెట్టాడు. ఒకటి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌ కూడా వెళ్లారు. అయినా కూడా రవిలో మార్పు రాలేదు. అంతేకాకుండా భార్యపై కక్ష పెంచుకొని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో నిద్రపోయిన సమయంలో రవి భార్య గొంతు పైన కాలుతో తొక్కి హత్య చేశాడు. ఆమె ఇంకా చనిపోలేదేమో అనే అనుమానంతో చున్నీని గొంతుకు బిగించి ఉరివేశాడు. తరువాత ఇంటి నుంచి పరారయ్యాడు. మరునాడు ఉదయం ఎంతకు తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘పుష్ప’ కోసం విజయశాంతిని సంప్రదించారా.. రాములమ్మ వద్దనడానికి కారణం ఇదేనా..!