కోవిడ్ పాండమిక్ భయం, గణ‌తంత్ర దినోత్సవాలకు 15 ఏళ్ళ లోపు పిల్లలకు నో పర్మిషన్, పరేడ్ రూట్ కుదింపు

కోవిడ్ పాండమిక్ కారణంగా ఈ సారి 26 న గణ తంత్రదినోత్సవాలకు 15 ఏళ్ళ లోపు పిల్లలను అనుమతించడం లేదు. పైగా పరేడ్ సాగే దూరాన్ని కూడా కుదించారు..

కోవిడ్ పాండమిక్ భయం, గణ‌తంత్ర దినోత్సవాలకు 15 ఏళ్ళ లోపు పిల్లలకు నో పర్మిషన్, పరేడ్ రూట్ కుదింపు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 19, 2021 | 9:39 AM

కోవిడ్ పాండమిక్ కారణంగా ఈ సారి 26 న గణ తంత్రదినోత్సవాలకు 15 ఏళ్ళ లోపు పిల్లలను అనుమతించడం లేదు. పైగా పరేడ్ సాగే దూరాన్ని కూడా కుదించారు. ఎప్పుడూ లక్షా 15 వేల మందిని అనుమతించేవారు. కానీ ఈ  మారు ఈ సంఖ్యను 25 వేలకు తగ్గించారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా బాగా తగ్గించినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పరేడ్ విజయ్ చౌక్ నుంచి మొదలై నేషనల్ స్టేడియం వద్ద ముగుస్తుందని, లోగడ ఇది  రెడ్ ఫోర్ట్ వరకు సాగేదని ఆయన చెప్పారు. గతంలో 8.2 కి.మీ. దూరం ఇది సాగితే ఈ సారి కేవలం 3.3 కి.మీ. దూరానికే పరిమితం కానుంది. ట్రూప్స్ మధ్య భౌతిక దూరం కూడా పాటిస్తారని, ప్రతివారూ మాస్కులు ధరించాల్సి ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు.ప్రతి కంటింజెంట్ లో 144 మందికి బదులు 96 మంది మాత్రమే ఉంటారన్నారు.

ఎంట్రీ పాయింట్ వద్ద ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ లక్షణాలున్నట్టు తేలితే వారి కోసం ఐసోలేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం  8 కేంద్రాలు, రెస్టింగ్ బూత్ లు ఉంటాయని, ప్రతి బూత్ లో డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఉంటారని ఆ అధికారి వివరించారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఈ సారి విదేశీ నేతలెవరూ ముఖ్య అతిథులుగా రావడంలేదన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావలసి ఉన్నా తమ దేశంలో మ్యుటెంట్ స్ట్రెయిన్ కారణంగా ఆయన చివరి క్షణంలో తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.

Also Read:

Ind vs China: చైనాతీరు పై భారత్ ఆగ్రహం, భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువచ్చింది.

Donald Trump: వైట్‌ హౌజ్‌ను విడడానికి సిద్ధమవుతోన్న డొనాల్డ్‌ ట్రంప్‌… పదవి దిగగానే ఎక్కడికి వెళ్లనున్నాడంటే..

జమ్మూకశ్మీర్ లేకుండా భారత్ మ్యాప్‌ను ఎలా చూపిస్తారు..? బీబీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ