Abhishek Agarwal: ఆ సినిమాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..

Abhishek Agarwal: కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ‘ది కశ్మీరీ ఫైల్స్‌’ అనే సినిమాను

Abhishek Agarwal: ఆ సినిమాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..
Follow us
uppula Raju

|

Updated on: Jan 19, 2021 | 9:29 AM

Abhishek Agarwal: కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ‘ది కశ్మీరీ ఫైల్స్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ రంజన్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం కశ్మీర్‌లో షూటింగ్ జరిపారు. అయితే ఈ చిత్రం నిర్మిస్తున్న వాళ్లను, చూసిన వాళ్లను ఊరికే వదిలిపెట్టేది లేదని కశ్మీరి మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

అయితే ఈ విషయంలో స్పందించిన చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ బెదిరింపులపై హైదరాబాద్‌లోన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇంకా ఈ సినిమా ఎడిటింగ్‌ కూడా మొదలుపెట్టలేదు అప్పుడే వాళ్లెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇందులో మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రలు పోషించారు. సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Nayanathara: మెగాస్టార్ అభిమానులకు ఇక పండగే.. ఆ పాత్రకు లేడీ సూపర్ స్టార్ నయనతార ఓకే చెప్పిందట..