Bigboss4: బిగ్‌బాస్‌ ఫేమ్‌ను బాగా క్యాష్‌ చేసుకుంటున్న అందాల భామ.. షాప్‌ ఓపెనింగ్‌కు అంత తీసుకుంటోందా..?

Monal Gajjar Remuneration: 'దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి' వినడానికి పాత సామతే అయినా.. దీన్ని తూచా తప్పకపాటిస్తుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో పిచ్చ క్లారిటీతో ఉంటారు...

Bigboss4: బిగ్‌బాస్‌ ఫేమ్‌ను బాగా క్యాష్‌ చేసుకుంటున్న అందాల భామ.. షాప్‌ ఓపెనింగ్‌కు అంత తీసుకుంటోందా..?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 19, 2021 | 10:01 AM

Monal Gajjar Remuneration: ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి’ వినడానికి పాత సామతే అయినా.. దీన్ని తూచా తప్పకపాటిస్తుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో పిచ్చ క్లారిటీతో ఉంటారు. ఫేమ్‌ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుంటారు. ప్రస్తుతం మోనాల్‌ గజ్జర్‌ ఈ పాలసీని బాగా ఫాలోఅవుతుంది. బిగ్‌బాస్‌ షోకు ముందు పలు చిత్రాల్లో నటించినా.. పెద్దగా పేరు సంపాదించుకోని మోనాల్‌.. ఈ రియాలిటీ షో తర్వాత ఒక్కసారిగా సెలబ్రిటీ హోదా సంపాదించుకుంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో తనదైన ఆటతీరు, అందంతో ఆకట్టుకున్న ఈ గుజరాతీ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇక ఈ క్రమంలోనే ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో చిందేసి మరింత ఫేమ్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ పాట కోసం మోనాల్‌ ఏకంగా రూ.50 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం. ఇక బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన ఫేమ్‌ను ఉపయోగించుకునే పనిలో పడ్డ మోనాల్‌.. ఏదైనా షాపు ఓపెనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నా రూ.10 లక్షలు ఇవ్వాలని కండిషన్‌ పెట్టినట్లు పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

Also Read: Adipurush Update: ‘ఆదిపురుష్’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. మోషన్ క్యాప్చర్‌ పనులు షురూ..