సంజయ్ రౌత్, శరద్ పవార్ లను బెదిరించిన వ్యక్తి అరెస్ట్

శివసేన నేత సంజయ్ రౌత్ ని, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ని ఫోన్ లో బెదిరించిన వ్యక్తిని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతా కు చెందిన పలాష్ ఘోష్ అనే ఈ వ్యక్తి...

సంజయ్ రౌత్, శరద్ పవార్ లను బెదిరించిన వ్యక్తి అరెస్ట్

Edited By:

Updated on: Sep 12, 2020 | 7:21 PM

శివసేన నేత సంజయ్ రౌత్ ని, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ని ఫోన్ లో బెదిరించిన వ్యక్తిని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతా కు చెందిన పలాష్ ఘోష్ అనే ఈ వ్యక్తి మూడు అంతర్జాతీయ ఫోన్ నెంబర్లను వినియోగించి ఇలా బెదిరించినట్టు పోలీసులు చెప్పారు. గ్యాంగ్ స్టర్  దావూద్ ఇబ్రహీం ముఠా తరఫున మాట్లాడుతున్నానంటూ ఇతగాడు చాలా బిల్డప్ ఇచ్చాడు. ఏకంగా సీఎం ఉధ్ధవ్ థాక్రే నివాసానికే ఫోన్ చేసి సంచలనం సృష్టించాడు. ఇతగాడు దుబాయ్ లో దాదాపు 15 ఏళ్లుగా పని చేశాడట. కోల్ కతా పోలీసుల సాయంతో మహారాష్ట్ర పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. శరద్ పవార్ ఇంటిని పేల్చివేస్తానని బెదిరించి పలాష్ ఘోష్ ‘పరేషానీ’ రేకెత్తించాడు.  మొత్తానికి ఇతని కథ సమాప్తమైంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us