బెంగాల్ సీఎం మమతా అసెంబ్లీ పోటీపై క్లారిటీ.. నందిగ్రామ్ నుంచి మాత్రమే బరిలోకి దిగుతున్నట్లు వెల్లడి

|

Feb 17, 2021 | 8:58 PM

అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంటే, హాట్రిక్ సాధించాలన్న సంకల్పంతో టీఎంసీ పోటీ పడుతున్నాయి.

బెంగాల్ సీఎం మమతా అసెంబ్లీ పోటీపై క్లారిటీ.. నందిగ్రామ్ నుంచి మాత్రమే బరిలోకి దిగుతున్నట్లు వెల్లడి
Follow us on

Mamata Banerjee contest : త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంటే, హాట్రిక్ సాధించాలన్న సంకల్పంతో టీఎంసీ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పోటీ పోటీ ర్యాలీలో బెంగాల్ పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే, సీఎం మమతా బెనర్జీ పోటీ చేసే నియోజకవర్గంపై టీఎంసీ అనధికారికంగా క్లారిటీ ఇచ్చింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నందిగ్రామ్ సీటు నుంచి మాత్రమే పోటీ చేయనున్నట్లు టీఎంసీ అధినేత సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. సీఎం మమత అంతర్గత సమావేశాల్లో కూడా ‘‘నేను కేవలం నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నాను’’ అని పేర్కొంటున్నారని ఆమె వర్గీయులు తెలిపారు. మునుపటి ఎన్నికలలో మమతా కోల్‌కతాలోని భబానిపూర్ సీటు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు.

అయితే భబానిపూర్ నుంచి ఎవర్ని బరిలోకి దించుతారన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని, ప్రస్తుత సమయంలో ఈ విషయంపై అధికారికంగా మాట్లాడలేమని తృణమూల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘నేను నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగితే ఎలా వుంటుంది? ఇది నా కోరిక. అయితే నేను మాత్రం ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే 294 నియోజకవర్గాలూ నావే. మీరందరూ నా తరపున పని చేయండి. ఆ తర్వాత మాత్రం నేను చూసుకుంటా.’’ అని మమత అన్నట్లు సమాచారం.

జనవరి మాసంలో జరిగిన ఓ ఎన్నికల సభలో సీఎం మమత మాట్లాడుతూ… తాను వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. నందిగ్రామ్‌తో పాుటు బబనీపూర్ నుంచి కూడా బరిలోకి దిగుతానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాత్రం నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగాలని సీఎం మమత నిశ్చయించుకున్నారు.

2011 ఉప ఎన్నికలో మమతా బెనర్జీ 54,213 ఓట్ల తేడాతో భబానిపూర్ స్థానం నుంచి గెలుపొందారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షి పోటీ చేయడానికి ఆమె ఈ స్థానాన్ని ఖాళీ చేశారు. 2016 లో మమతా బెనర్జీ మళ్లీ భబానిపూర్ నుండి పోటీ చేసి 47.67 శాతం ఓట్లతో విజయం సాధించారు.

అయితే 2021 లో రాజకీయా పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ విశ్వసనీయ సహాయకుడు, మాజీ నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీలో చేరారు. అతను టీఎంసీ నుంచి వైదొలిగిన తరువాత, మమత యుద్ధాన్ని నేరుగా బీజేపీనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.

ఇదీ చదవండి… వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు జడ్జికి షాక్.. జడ్జిమెంట్‌ను తప్పుబడుతూ ఆ ప్యాకెట్లను పంపిన మహిళ..!