సదా రాజకీయాల్లో బిజీగా ఉండే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తరచూ వాటికి విరామమిచ్చి పెళ్లిళ్ల వంటి వేడుకల్లో పాల్గొంటుంటారు. మంగళవారం అలీపుర్దార్ జిల్లా ఫలకటా ప్రాంతంలో ఓ స్వఛ్చంద సంస్థ నిర్వహించిన సామూహిక పెళ్లిళ్ల వేడుకలో ఆమె పాల్గొన్నారు. గిరిజన యువతులతో కలిసి డ్రమ్స్ బీట్స్ కి అనుగుణంగా స్టెప్స్ వేశారు. అక్కడే జరిగిన మరో కార్యక్రమంలో కూడా ఆమె ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఇలా దీదీ డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. కోల్ కతా లో ఆ మధ్య మ్యూజిషియన్ బాసంతి హేమాంబరం నిర్వహించిన నృత్య కార్యక్రమాల్లోనూ, గత ఏడాది మాల్దా జిల్లాలో జరిగిన మాస్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా ఆమె ఇలాగే డ్యాన్సర్లతో చిందులు వేశారు.
రాజకీయాలకు, కళలకు ఏ మాత్రం సంబంధం లేదన్నది ఆమె ఉదేశ్యం. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో మతపరమైన నినాదాలు చేయరాదని కూడా ఆమె అంటుంటారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల కోల్ కతా లో నేతాజీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జై శ్రీరామ్ అంటూ కొందరు చేసిన నినాదాలపట్ల ఆమె అసహనం వ్యక్తం చేసిన విషయం గమనార్హం. ఆ కార్యక్రమంలో ప్రసంగించేందుకు కూడా ఆమె నిరాకరించారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee dances during a mass marriage ceremony in Falakata of Alipurduar district. pic.twitter.com/zIDyhRDS7x
— ANI (@ANI) February 2, 2021