Mahatma Gandhi: మహాత్మగాంధీ మనుమడు అరుణ్ గాంధీ కన్నుమూత

మహాత్మగాంధీ మనుమడు అరుణ్ గాంధీ (89) మృతి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Mahatma Gandhi: మహాత్మగాంధీ మనుమడు అరుణ్ గాంధీ కన్నుమూత
Arun Gandhi

Updated on: May 02, 2023 | 5:06 PM

మహాత్మగాంధీ మనుమడు అరుణ్ గాంధీ (89) మృతి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మహాత్మగాంధీ రెండో కుమారుడైన మనిలాల్ గాంధీ, సుశీల దంపతులకు పుట్టిన వ్యక్తే ఈ అరుణ్ గాంధీ. ఈయన్ని పీస్ ఫార్మర్ అని కూడా పిలుస్తారు. అయితే అరుణ్ గాంధీ అంత్యక్రయలు మంగళవారం సాయంత్రం కొల్హాపూర్‌లో నిర్వహించ‌నున్నట్లు ఆయ‌న కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు.

1934, ఏప్రిల్ 14వ తేదీన సౌత్ ఆఫిక్రాలోని డ‌ర్బన్‌లో అరుణ్ గాంధీ జ‌న్మించారు. మ‌హాత్మా గాంధీ అడుగుజాడ‌ల్లో న‌డిచిన ఆయన. సామాజిక-రాజకీయ కార్యకర్తగా ఎదిగారు. అంతేకాదు అరుణ్ గాంధీ రచయిత కూడా. కస్తూర్భా, ది ఫర్‌గాట్టెన్ ఉమెన్, గ్రాండ్ ఫాదర్ గాంధీ, ది గిఫ్ట్ ఆఫ్ ఆంగర్ లాంటి పుస్తకాలు ఆయన రచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..