Maharashtra Reports : మహారాష్ట్రలో కరోనా మహా విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల మార్కును దాటింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, రెండంకెల సంఖ్యల్లో మరణాలు నమోదవుతున్నాయి.
సోమవారం నుంచి మంగళవారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,405 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, వైరస్ ధాటికి తాళలేక ఒక్కరోజే 47 మంది ప్రాణాలొదిలారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,13,353కు చేరకుందని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇక ఇప్పటివరకు కొవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 50,862కు చేరుకుంది. మరోవైపు, గత 24 గంటల్లో 4,060 మంది కరోనా రోగులు కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి 2,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,17,450కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 43,811 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.
Maharashtra reports 2,405 new #COVID19 cases, 2,106 discharges, and 47 deaths today
Total cases: 20,13,353
Total recoveries: 19,17,450
Death toll: 50,862
Active cases: 43,811 pic.twitter.com/q1rIiA0pNc— ANI (@ANI) January 26, 2021